Higher Education : ప్రాంతీయ భాషల్లో ఉన్నత విద్య సాధ్యమేనా? అధ్యయనాలు ఏం చెబుతున్నాయంటే?

ఇంగ్లీష్ భాషకు ఫుల్ డిమాండ్ ఉంది. ఎడ్యుకేషన్ సిస్టమ్ ఇంగ్లీష్ భాషపైనే ఫోకస్ పెట్టింది. ఉన్నత విద్యను ప్రాంతీయ భాషల్లో నిర్వహించడం సాధ్యమేనా? ఇది ఎంతవరకు ఆచరణాత్మకమైనదో చూడాలి.

Higher Education In Regional Languages

higher education in regional languages : ప్రస్తుత ఆధునిక యుగంలో ఇంగ్లీష్ భాషకు ఫుల్ డిమాండ్ ఉంది. ఇప్పటీ ఎడ్యుకేషన్ సిస్టమ్ ఇంగ్లీష్ భాషపైనే ఫోకస్ పెట్టింది. ఆంగ్ల మాధ్యమంలోనే ఉన్నత విద్యను అందించడంతో ప్రాంతీయ భాషలకు ఆదరణ కరవుతోంది.  ఫలితంగా విద్యలో ప్రాంతీయ భాషపై పట్టు సాధించలేని పరిస్థితి ఎదురవుతుంది. అన్ని కోర్సులు ఇంగ్లీష్ మాధ్యమంలోనే ఉండటం కంటే ప్రాంతీయ భాషల్లోనూ నిర్వహించడం వల్ల అనేక ప్రయోజనాలు ఉంటాయనే అభిప్రాయం కొందరిలో వ్యక్తమవుతోంది. వాస్తవానికి ఉన్నత విద్యను ప్రాంతీయ భాషల్లో నిర్వహించడం సాధ్యమేనా? అంటే ప్రభుత్వ విద్యా వ్యవస్థలో ఇది ఎంతవరకు ఆచరణాత్మకమైనదా లేదో చూడాలి.

డిజిటల్ ప్లాట్ ఫాంలో ఇంగ్లీష్ కంటెంట్ మాత్రమే కాకుండా అనేక ప్రాంతీయ భాషల్లో కోర్సులు అందుబాటులోకి వచ్చేశాయి. ముఖ్యంగా గూగుల్ సర్వీసు యూట్యూబ్ లో రీజినల్ లాంగ్వేజీ ఎడ్యుకేషన్ కోర్సులు బోలెడన్నీ అందుబాటులో ఉన్నాయి. ఇప్పటికే హిందీ, ఇతర భారతీయ భాషల్లో కోర్సుల కంటెంట్ లభించడంతో ఎక్కువ సంఖ్యలో వ్యూయర్ షిప్ పొందుతున్నాయి. తద్వారా దేశీయ భాషలకు భారీ డిమాండ్ ఏర్పడింది. అదే ఎడ్యుకేషన్ ఛానెళ్లలో హిందీ, భారతీయ భాషల్లో మ్యాథ్స్, సైన్స్ అండ్ టెక్ వంటి కంటెంట్ ఎక్కువగా అధికంగా సెర్చ్ చేస్తున్నవారి సంఖ్య పెరిగిపోయింది. ఈ డిమాండ్‌ను ఎడ్‌టెక్ స్టార్టప్‌లు ఈ మార్కెట్‌ని క్యాష్ చేసుకుంటున్నాయి.

ఐదు భారతీయ భాషల్లో టెక్నికల్ కోర్సులు :
ఈ ఏడాదిలో స్వాతంత్ర్య దినోత్సవ ప్రసంగంలో ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ జాతీయ విద్యా విధానం (NEP) కింద ప్రతిపాదిత సంస్కరణలను ప్రస్తావించారు. ప్రాథమిక, ఉన్నత విద్య స్థాయిలలో టీచింగ్ కోసం ప్రాంతీయ భాషల ప్రాధాన్యతను ఆయన నొక్కి చెప్పారు. కొత్త విద్యా సంవత్సరానికి 14 ఇంజనీరింగ్ కళాశాలల్లో ఐదు భారతీయ భాషల్లో టెక్నికల్ కోర్సులను ప్రారంభించడానికి దారితీసింది. స్థానిక భాషలలో ప్రాథమిక విద్యను అందించడం వల్ల మరిన్ని ప్రయోజనాలను పొందవచ్చు. ఉన్నత విద్యలో ప్రాంతీయ, ఆంగ్ల భాషల్లో టీచింగ్ ప్రత్యేకంగా అందించినప్పటికీ.. ప్రభుత్వ విద్యా వ్యవస్థలో ప్రాంతీయ భాషల్లో టెక్నికల్ కోర్సులు ఎంతవరకు సాధ్యమనేది చూడాలి.

ఇతర ఆసియా దేశాలలో ఆంగ్ల మాధ్యమంతో పోలిస్తే.. భారత్‌లో ప్రాంతీయ భాషల్లో అందించే పాఠశాలల్లోని విద్యార్థుల అభ్యాస ఫలితాలు సానుకూలంగా ఉన్నాయని అనేక అధ్యయనాలు సూచిస్తున్నాయి. ముఖ్యంగా సైన్స్, గణితం, ఆంగ్లంతో పోలిస్తే.. మాతృభాషలో చదువుతున్న విద్యార్థులలో విద్యాభ్యాసం మెరుగ్గా ఉందని చెబుతున్నాయి. ఎడ్యుకేషన్ సైకాలజీ, సాహిత్యం వంటివి స్థానిక భాషల్లో టీచింగ్ అదనపు ప్రయోజనాలను అందిస్తున్నట్టు తేలింది. మాతృభాషలో చదివే విద్యార్ధులలో అధిక హాజరు శాతం ఉందని అధ్యయనాలు చెబుతున్నాయి.

ఇంగ్లీషును ఒక భాషగా మాత్రమే బోధించమని కాదు.. ఇటీవల ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు మనం ‘మాతృభాష వర్సెస్ ఇంగ్లీష్’ విధానం నుంచి ‘మాతృభాష ప్లస్ ఇంగ్లీష్’ విధానం వైపుకు మారాలని ఆకాంక్షించారు. కాగ్నిటివ్ సైకాలజీ పరిశోధనలో చిన్న పిల్లలు కొత్త భాషలను త్వరగా గ్రహిస్తారని తేలింది. ప్రాంతీయ-మధ్యస్థ కోర్సులకు టీచర్ల లభ్యత కూడా మరొక అడ్డంకిగా మారొచ్చు . భారత్‌లో ఉన్నత విద్యను ప్రాంతీయ భాషలలో బోధించేందుకు ఇష్టపడే నైపుణ్యం గల ఉపాధ్యాయులను ఆకర్షించడం సవాలుగానే చెప్పాలి. AICTE, కంప్యూటర్ సైన్స్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ వంటి విభాగాల్లో ప్రాంతీయ భాషా టీచింగ్ అందించవచ్చు. అయితే ఆంగ్లంలో ఉండే కోడింగ్‌ను ప్రాంతీయ-భాషల్లో బోధించాలంటే అధ్యాపకుల శిక్షణ తప్పక అవసరం పడుతుంది.

ఉన్నత విద్యను ప్రాంతీయ భాషలలో ఇంజినీరింగ్ కోర్సులను అందించవచ్చు. తద్వారా అట్టడుగు ప్రత్యేక వర్గాల మధ్య ఉన్నత విద్యలో ప్రవేశాన్ని తగ్గించవచ్చు. కానీ, ప్రాంతీయ భాషల్లో పాఠ్యపుస్తకాలు, పండిత సాహిత్యం వంటివి లభించడం ప్రధాన సవాళ్లుగా మారనుంది. ఆల్ ఇండియా కౌన్సిల్ ఆఫ్ టెక్నికల్ ఎడ్యుకేషన్ (AICTE) పుస్తకాలు, అకడమిక్ జర్నల్స్ వీడియోలను ప్రాంతీయ భాషల్లోకి ట్రాన్సులేట్ చేసేందుకు కృత్రిమ మేధస్సుతో కూడిన టూల్ ప్రారంభించింది. మిషన్ లెర్నింగ్ ద్వారా ప్రాంతీయ భాషల్లో టీచింగ్ అందించడంపై మరింత కృషి అవసరమని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.