Wrestlers Protest: బ్రిజ్ భూషణ్ కేసులో బిగ్ ట్విస్ట్.. సెలెక్ట్ చేయలేదని కోపంతో పోక్సో కేసు పెట్టారట
బ్రిజ్ భూషణ్ సింగ్‌పై లైంగిక వేధింపుల ఆరోపణలు చేసిన మైనర్ తన వాంగ్మూలాన్ని ఉపసంహరించుకున్నట్లు పోలీస్ వర్గాలు తెలిపాయి. తనను ఎంపిక చేయకపోవడంపై ఆగ్రహం వ్యక్తం చేయడంతో డబ్ల్యూఎఫ్‌ఐ చీఫ్‌పై కేసు పెట్టినట్లు ఆమె వెల్లడించారట

Brij Bhushan Sharan Singh: లైంగిక ఆరోపణలు ఎదుర్కొంటున్న రెజ్లింగ్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా చీఫ్ బ్రిజ్ భూషణ్ శరణ్ సింగ్ మీద పోక్సో కేసు రద్దు చేయాలని కోరుతూ పాటియాలా హౌస్ కోర్టు ముందు ఛార్జ్ షీట్ ఫైల్ చేసినట్లు ఢిల్లీ పోలీసులు వెల్లడించారు. ఈ కేసుకు సంబంధించిన ఆధారాలు లేకపోవడంతో ఢిల్లీ కోర్టులో డబ్ల్యూఎఫ్‌ఐ చీఫ్‌పై పోక్సో చట్టం కింద నమోదు చేసిన ఎఫ్‌ఐఆర్‌ను రద్దు చేయాలని పోలీసులు సిఫార్సు చేశారు. ఈ విషయమై కోర్టుకు 550 పేజీల నివేదికను కోర్టుకు పోలీసులు అందజేశారు. ఢిల్లీ పోలీసు అధికారులు పాటియాలా హౌస్ కోర్టుకు చేరుకుని ఈ అంశంపై రద్దు నివేదికను సమర్పించారు.
Vijayasai Reddy: పవన్ కల్యాణ్ కు విజయసాయి కౌంటర్.. విరుచుకుపడుతున్న జనసైనికులు
“పోక్సో విషయంలో, దర్యాప్తు పూర్తయిన తర్వాత, మేము ఫిర్యాదుదారుని అంటే బాధితురాలి తండ్రి సహా బాధితురాలి వాంగ్మూలాల ఆధారంగా కేసును రద్దు చేయమని అభ్యర్థిస్తూ సెక్షన్ 173 (Cr PC) కింద పోలీసు నివేదికను సమర్పించాము’’ అని ఢిల్లీ పోలీస్ పీఆర్వో గురువారం తెలిపారు. బ్రిజ్ భూషణ్ సింగ్‌పై లైంగిక వేధింపుల ఆరోపణలు చేసిన మైనర్ తన వాంగ్మూలాన్ని ఉపసంహరించుకున్నట్లు పోలీస్ వర్గాలు తెలిపాయి. తనను ఎంపిక చేయకపోవడంపై ఆగ్రహం వ్యక్తం చేయడంతో డబ్ల్యూఎఫ్‌ఐ చీఫ్‌పై కేసు పెట్టినట్లు ఆమె వెల్లడించారట.
“నేను ఎంపిక కాలేదు. నేను చాలా కష్టపడ్డాను. నేను డిప్రెషన్‌లో ఉన్నాను. అందుకే కోపంతో లైంగిక వేధింపుల కేసు పెట్టాను” అని మైనర్ రెజ్లర్ స్టేట్మెంట్ ఇచ్చిందని దర్యాప్తు వర్గాలు తెలిపాయి. ఈ కేసుపై కోర్టు జూలై 4వ తేదీకి తదుపరి విచారణను వాయిదా వేసింది. ఏప్రిల్ 28న ఢిల్లీ పోలీసులు సింగ్‌పై కన్నాట్ ప్లేస్ పోలీస్ స్టేషన్‌లో రెండు ఎఫ్‌ఐఆర్‌లు నమోదు చేశారు.