Israel : హమాస్‌కు వ్యతిరేకంగా పోరాటానికి 3 లక్షల ఇజ్రాయెల్ సైనికులు

హమాస్‌కు వ్యతిరేకంగా పోరాడేందుకు ఇజ్రాయెల్ కేవలం 48 గంటల్లో 3 లక్షల మంది సైనికులను రంగంలోకి దించింది. దేశ సరిహద్దులోని 24 పట్టణాల్లో 15 పట్టణాలను సైన్యం ఖాళీ చేసిందని ఇజ్రాయెల్ ఆర్మీ అధికారి తెలిపారు....

Israel Mobilises 3 Lakh Troops

Israel : హమాస్‌కు వ్యతిరేకంగా పోరాడేందుకు ఇజ్రాయెల్ కేవలం 48 గంటల్లో 3 లక్షల మంది సైనికులను రంగంలోకి దించింది. దేశ సరిహద్దులోని 24 పట్టణాల్లో 15 పట్టణాలను సైన్యం ఖాళీ చేసిందని ఇజ్రాయెల్ ఆర్మీ అధికారి తెలిపారు. ఘోరమైన హమాస్ దాడికి వ్యతిరేకంగా ఇజ్రాయెల్ ప్రతీకారం తీర్చుకునేందుకు సమాయత్తమైంది. 48 గంటల్లో 3 లక్షల సైనికులను సమీకరించడం రికార్డు అని రియర్ అడ్మిరల్ డేనియల్ హగారి చెప్పారు. శనివారం ఉదయం నుంచి ఇజ్రాయెల్‌పై పోరాటం ప్రారంభించినప్పటి నుంచి 4,400 రాకెట్లు ప్రయోగించారు.

Also Read :Tamil Nadu :బాణాసంచా ఫ్యాక్టరీలో పేలుడు, 9 మంది మృతి

షార్ హనేగేవ్ ప్రాంతీయ మండలిలో సైనికులు ముగ్గురు ఉగ్రవాదులను హతమార్చారని హగారి పేర్కొన్నారు. శనివారం దాడికి ముందు కొందరు హమాస్ ఉగ్రవాదులు ఇజ్రాయెల్ లో ఉన్నారని వెల్లడైంది. మరో వైపు లెబనాన్ నుంచి ఇజ్రాయెల్ భూభాగంలోకి అనుమానితుల చొరబాట్లతో సైనికదళాలను మోహరించింది. లెబనీస్ సరిహద్దుకు సమీపంలోని పట్టణాల్లోని ఇజ్రాయెల్ పౌరులను వారి ఇళ్లలోనే ఉండమని ఆదేశించింది. హమాస్ టెర్రర్ గ్రూప్ సామర్థ్యాలను నాశనం చేసే ప్రయత్నంలో భాగంగా రాత్రిపూట పెద్ద ఎత్తున దాడులు చేశారు.

Also Read : Ladakh : లడఖ్‌లో మళ్లీ హిమపాతం…సైనికుడి మృతి, నలుగురు గల్లంతు

శనివారం దాడి నుంచి 700 మందికి పైగా ఇజ్రాయిలీలు మరణించారు. ఈ దాడిలో 2000 మందికి పైగా గాయపడ్డారు. గాజాలో బందీలుగా ఉన్న వారి సంఖ్య 100 కంటే ఎక్కువగా ఉందని ఇజ్రాయెల్ ప్రధాన మంత్రి కార్యాలయం తెలిపింది. గాజా సరిహద్దులోని అన్ని పట్టణాలపై ఇజ్రాయెల్ దళాలు తిరిగి నియంత్రణ సాధించాయని ఇజ్రాయెల్ డిఫెన్స్ ఫోర్సెస్ టాప్ అధికార ప్రతినిధి రియర్ అడ్మిరల్ డేనియల్ హగారి తెలిపారు.