ఆరోజే నాకు క్యాన్సర్ ఉందని తెలిసింది.. ఇస్రో చీఫ్ సోమ్‌నాథ్ వెల్లడి!

ISRO Chief S Somnath : ఆదిత్య-ఎల్1 మిషన్‌ను అంతరిక్షంలోకి పంపిన రోజనే క్యాన్సర్ ఉన్నట్లు నిర్ధారణ అయిందని ఓ ఇంటర్వ్యూలో ఇస్రో చీఫ్ సోమనాథ్ వెల్లడించారు.

ISRO Chief S Somnath Diagnosed With Cancer On Day Of Aditya L-1 Launch

ISRO Chief S Somnath : భారత అంతరిక్ష పరిశోధనా సంస్థ, ఇస్రో చీఫ్‌ ఎస్‌.సోమ్‌నాథ్‌కు క్యాన్సర్‌ బారిన పడ్డారు. తార్మాక్ మీడియా హౌస్‌కి ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆయన ఈ విషయాన్ని స్వయంగా వెల్లడించారు. ఆదిత్య-ఎల్ 1 లాంచ్ రోజున తనకు క్యాన్సర్ వ్యాధి నిర్ధారణ అయినట్లు ఇస్రో చీఫ్ తెలిపారు. చంద్రయాన్-3 మిషన్ లాంచ్ సమయంలో కొన్ని ఆరోగ్య సమస్యలు ఉన్నాయని స్కానింగ్ ద్వారా గుర్తించినట్టు చెప్పారు. అయితే, ఆ సమయంలో క్యాన్సర్‌ ఉందనే విషయం తనకు స్పష్టంగా తెలియలేదన్నారు. దాని గురించి స్పష్టమైన అవగాహన లేదని సోమనాథ్ ఇంటర్వ్యూలో పేర్కొన్నారు.

నివేదిక ప్రకారం.. భారత అంతరిక్ష సంస్థ దేశం మొట్టమొదటి సోలార్ మిషన్ ఆదిత్య ఎల్-1ని లాంచ్ చేసిన రోజునే ఇస్రో చీఫ్‌కు క్యాన్సర్ ఉందని నిర్ధారణ అయింది. సెప్టెంబర్ 2, 2023న చంద్రయాన్-3 ప్రయోగించిన కొన్ని వారాల తర్వాత ఆదిత్య ఎల్-1 చంద్రుని దక్షిణ ధ్రువంపై విజయవంతంగా సాఫ్ట్ ల్యాండింగ్ అయింది. భారత మొదటి సౌర మిషన్ ప్రారంభించిన కొద్దిసేపటికే ఇస్రో చీఫ్ సోమ్‌నాథ్ ఒక ఆపరేషన్ చేయించుకున్నారు.

రొటీన్ స్కానింగ్ లో బయపడ్డ క్యాన్సర్ : 
అంతకుముందు రొటీన్ స్కాన్‌ చేయించుకోగా కడుపులో క్యాన్సర్ వంటిది ఏదో ఉందని నిర్ధారణ అయింది. ఆపరేషన్ అనంతరం ఆయన కీమోథెరపీ కూడా చేయించుకున్నారు. ఆ తర్వాత చెన్నైలో మరిన్ని స్కానింగ్స్ అవసరమని వైద్యులు సూచించినట్టు తెలిపారు.

ఎస్. సోమ్‌నాథ్ ఆరోగ్యపరంగా తాను ఎదుర్కొన్న సవాళ్లు, అనుభవం గురించి మాట్లాడుతూ.. ‘ఇది నా కుటుంబాన్ని, సహోద్యోగులను దిగ్భ్రాంతికి గురిచేసింది. కానీ, ఇప్పుడు, నేను క్యాన్సర్ చికిత్స మాత్రమే అందుకు పరిష్కారమని గ్రహించాను. ఈ వ్యాధి వారసత్వంగా వచ్చినట్లు వైద్యులు తెలిపారు. క్రమంతప్పకుండా చెకప్‌లు, స్కాన్‌లు చేయించుకున్నాను’ అంటూ ఇస్రో చీఫ్ పేర్కొన్నారు.

క్యాన్సర్‌తో తన పోరాటం గురించి సోమ్‌నాథ్ అనే విషయాలను వెల్లడించారు. క్యాన్సర్ వ్యాధి నుంచి కోలుకున్న నాలుగు రోజుల తర్వాత ఐదవ రోజు ఎలాంటి ఇబ్బంది లేకుండా చైర్మన్‌గా తిరిగి తన విధుల్లో చేరానని తెలిపారు. కానీ, ఇప్పుడు తాను పూర్తిగా కోలుకున్నానని, తిరిగి ఎప్పటిలానే విధులను నిర్వరిస్తున్నానని ఇస్రో చీఫ్ సోమ్ నాథ్ చెప్పుకొచ్చారు.

Read Also : Viral Video : దీంతో కూడా ఆడొచ్చ‌ని అప్ప‌ట్లో తెలిసుంటేనా..? ఎప్పుడో బ్యాడ్మింట‌న్ ప్లేయ‌ర్‌ను అయ్యేవాడిని!

ట్రెండింగ్ వార్తలు