Isro offers technology : ఇస్రో టెక్నాలజీతో విశ్వవిద్యాలయాల్లో ర్యాగింగ్ నిరోధం…బెంగాల్ ఛాన్సలర్ సీవీ ఆనందబోస్ వెల్లడి

భారత అంతరిక్ష పరిశోధనా సంస్థ (ఇస్రో) సాంకేతికతో యూనివర్సిటీ క్యాంపస్‌లలో ర్యాగింగ్‌ను నిరోధించవచ్చా ? అంటే అవునంటున్నారు పశ్చిమబెంగాల్ రాష్ట్ర గవర్నర్ సీవీ ఆనందబోస్. భారత అంతరిక్ష పరిశోధనా సంస్థ (ఇస్రో) పశ్చిమ బెంగాల్‌లోని యూనివర్సిటీ క్యాంపస్‌లలో ర్యాగింగ్‌ను నిరోధించడానికి ఇస్రో అధునాతన సాంకేతికతను అందించిందని బెంగాల్ రాష్ట్ర గవర్నర్ సీవీ ఆనందబోస్ చెప్పారు.....

Isro offers technology

Isro offers technology : భారత అంతరిక్ష పరిశోధనా సంస్థ (ఇస్రో) సాంకేతికతో యూనివర్సిటీ క్యాంపస్‌లలో ర్యాగింగ్‌ను నిరోధించవచ్చా ? అంటే అవునంటున్నారు పశ్చిమబెంగాల్ రాష్ట్ర గవర్నర్ సీవీ ఆనందబోస్. భారత అంతరిక్ష పరిశోధనా సంస్థ (ఇస్రో) పశ్చిమ బెంగాల్‌లోని యూనివర్సిటీ క్యాంపస్‌లలో ర్యాగింగ్‌ను నిరోధించడానికి ఇస్రో అధునాతన సాంకేతికతను అందించిందని బెంగాల్ రాష్ట్ర గవర్నర్ సీవీ ఆనందబోస్ చెప్పారు. (Isro offers technology to prevent ragging)

Chandryaan-3 :చంద్రుడిపై ప్రజ్ఞాన్ రోవర్ మూన్‌వాక్‌ ప్రారంభం…ఇస్రో ల్యాండర్ ఇమేజర్ కెమెరా చిత్రాల విడుదల

క్యాంపస్‌లలో ర్యాగింగ్‌ను సమర్థవంతంగా నిరోధించడానికి తగిన సాంకేతికతను అందించాలని పశ్చిమ బెంగాల్ గవర్నర్,విశ్వవిద్యాలయాల ఛాన్సలర్ సి వి ఆనంద బోస్ ఇస్రో ఛైర్మన్ సోమనాథ్‌ను సంప్రదించారు. (West Bengal universities) గవర్నర్‌ బోస్‌ హైదరాబాద్‌లోని అడ్వాన్స్‌డ్‌ డేటా ప్రాసెసింగ్‌ రీసెర్చ్‌ ఇన్‌స్టిట్యూట్‌తో కూడా చర్చించారు. సాంకేతికత వీడియో అనలిటిక్స్, ఇమేజ్ మ్యాచింగ్, ఆటోమేటిక్ టార్గెట్ రికగ్నిషన్ , రిమోట్ సెన్సింగ్ వంటి బహుళ వనరులను ఉపయోగించనుంది.

Heavy Rainfall : పలు రాష్ట్రాల్లో భారీవర్షాలు..ఐఎండీ హెచ్చరిక

జాదవ్‌పూర్ యూనివర్శిటీలో మొదటి సంవత్సరం చదువుతున్న విద్యార్థి వర్సిటీ హాస్టల్‌లోని బాల్కనీలో నుంచి పడి మృతి చెందిన కొన్ని రోజుల తర్వాత ఈ పరిణామం చోటు చేసుకుంది. విద్యార్థి మృతికి సంబంధించి మొత్తం 12 మందిని అరెస్టు చేశారు. అరెస్టయిన వారిలో పూర్వ విద్యార్థులు కూడా ఉన్నారు.