ITBP : సెల్యూట్ సైనికా.. మోకాళ్ల లోతు మంచులో జవాన్లు

15 వేల అడుగుల ఎత్తులో దుప్పటిలా పరచుకుని ఉన్న మంచులో 0 డిగ్రీల ఉష్ణోగ్రతలో గస్తీ నిర్వహిస్తున్నారు మన ఐటీబీపీ జవాన్లు. దేశ రక్షణలో జవాన్ల శౌర్యానికి, దృఢ సంకల్పానికి ఇంతకన్నా...

ITBP : సెల్యూట్ సైనికా.. మోకాళ్ల లోతు మంచులో జవాన్లు

Itbp

Updated On : February 17, 2022 / 3:26 PM IST

ITBP Personnel Patrolling : దేశ రక్షణ కోసం తమ ప్రాణాలను ఫణంగా పెట్టి డ్యూటీ చేస్తున్నారు మన ఐటీబీపీ జవాన్లు. హిమాలయాల్లో అత్యంత అననుకూల వాతావరణంలో ఇండో-టిబెటన్‌ బోర్డర్‌ పోలీసులు విధులు నిర్వహిస్తున్నారు. ఉత్తరాఖండ్‌ హిమాలయాల్లో ఐటీబీబీ సైనికులు గస్తీ కాస్తున్న విజువల్స్‌ బయటకు వచ్చాయి. జవాన్లు చేస్తున్న సాహసాన్ని చూస్తే ప్రతి ఒక్కరూ సెల్యూట్‌ కొట్టాల్సిందే. మోకాళ్లలోతు మంచులో జవాన్లు అడుగు తీసి అడుగు వేస్తున్న దృశ్యాలు నిజంగా కలచివేస్తాయి. గజ గజ వణికే చలిలో ఎంతో కష్టంగా అడుగు తీసి అడుగు వేస్తున్నారు. అత్యంత కఠోరమైన వాతావరణంలో వారు విధులు నిర్వహిస్తూ దేశాన్ని కంటికి రెప్పలా కాపాడుతున్నారు.

Read More : Kerala : దేశంలోనే అత్యంత చిన్నవయసు గల మేయర్,ఎమ్మెల్యేల వివాహం

15 వేల అడుగుల ఎత్తులో దుప్పటిలా పరచుకుని ఉన్న మంచులో 0 డిగ్రీల ఉష్ణోగ్రతలో గస్తీ నిర్వహిస్తున్నారు మన ఐటీబీపీ జవాన్లు. దేశ రక్షణలో జవాన్ల శౌర్యానికి, దృఢ సంకల్పానికి ఇంతకన్నా నిదర్శనం ఏముంటుంది. 1962 లో భారత్‌-చైనాల మధ్య యుద్ధం సందర్భంగా ఐటీబీపీని ఏర్పాటు చేశారు. అప్పటి నుంచి దేశ సరిహద్దులోని హిమాలయ పర్వత ప్రాంతాలలో గస్తీ నిర్వహిస్తోంది. ఇండో-టిబెటన్‌ బోర్డర్‌ పోలీసులకు మైనస్ 25 డిగ్రీల సెల్సియస్ కంటే తక్కువ ఉష్ణోగ్రతలో శిక్షణ ఇస్తారు. గడ్డ కట్టే చలిలోనూ వారు వెన్ను చూపరు.

Read More : Haryana : ప్రైవేటు సంస్థల్లో 75 శాతం రిజర్వేషన్.. సమస్యను తొందరగా పరిష్కరించాలన్న సుప్రీం

ఆర్మీ జవాన్ల గురించి ఎంత చెప్పినా తక్కువే. దేశాన్ని కాపాడేందుకు సరిహద్దుల్లో పడుతున్న కష్టాలు అన్నీ.. ఇన్ని కావు. వాన‌కు త‌డుస్తారు. ఎండ‌కు ఎండుతాడు. చ‌లికి వ‌ణుకుతారు. ప్రాణాల‌ను ప‌ణంగా పెట్టి దేశం కోసం సేవలందిస్తారు. అందుకే మన జవాన్లు గ్రేట్.