ఎకనామీ ఐసీయూలో..స్టాక్ మార్కెట్లు జోరులో : మాజీ ఆర్థిక సలహాదారు

  • Published By: venkaiahnaidu ,Published On : December 19, 2019 / 03:03 PM IST
ఎకనామీ ఐసీయూలో..స్టాక్ మార్కెట్లు జోరులో : మాజీ ఆర్థిక సలహాదారు

Updated On : December 19, 2019 / 3:03 PM IST

ఓ వైపు దేశఆర్థికవ్యవస్థ మునిగిపోతున్న సమయంలో స్టాక్ మార్కెట్లు మాత్రం ఉల్లాసంగా ఉండటం తనకు ఒక పజిల్ అని మాజీ ముఖ్య ఆర్థిక సలహాదారు అరవింద్ సుబ్రమణియన్ అన్నారు.

గురువారం(డిసెంబర్-19,2019) అహ్మదాబాద్ లోని ఇండియన్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ మేనేజ్ మెంట్(IIM-A)లో NSEసెంటర్ ప్రారంభోత్సవ కార్యక్రమంలో అరవింద్ సుబ్రమణియన్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ…ఈ సెంటర్ మొట్టమొదటి ఎకనామిక్స్ ప్రాజెక్ట్…ఆర్థిక వ్యవస్థ ఎందుకు క్రిందికి క్రిందికి వెళుతున్నదో… స్టాక్ మార్కెట్ పైకి, పైకి ఎందుకు పెరుగుతుందో నాకు వివరిస్తుందని నేను ఆశిస్తున్నాను. మీరు నా కోసం ఈ పజిల్‌ను క్రాక్ చేయగలిగితే… దాన్ని అర్థం చేసుకోవడానికి నేను యుఎస్ నుండి ఇక్కడకు వచ్చేస్తాను. నాకు అర్థం కాని ఇతర విషయాలు చాలా ఉన్నాయి (భారతదేశంలో ఆర్థిక మార్కెట్లు వంటివి)అని అరవింద్ సుబ్రమణియన్ అన్నారు.

భారతదేశం “గొప్ప మందగమనాన్ని” ఎదుర్కొంటుందని బుధవారం అరవింద్ చెప్పిన విషయం తెలిసిందే. భారత ఆర్థికవ్యవస్థ ఐసీయూలో ఉందని ఆయన అన్నారు.నరేంద్ర మోదీ సర్కార్ తొలిసారి అధికారం చేపట్టినప్పుడు ఆర్థిక సలహాదారుడిగా వ్యవహరించిన సుబ్రమణియన్ గతేడాది ఆగస్టులో పదవికి రాజీనామా చేసిన విషయం తెలిసిందే.భారత ఆర్థిక వ్యవస్థ నాలుగు బ్యాలెన్స్ షీట్ల నుంచి సవాళ్లను ఎదుర్కొంటున్నదని, వీటిలో బ్యాంకులు, మౌలిక…ఎన్బీఎఫ్సీలు, రియల్ ఎస్టేట్ కంపెనీల నుంచి గట్టి సవాళ్లను ఎదుర్కొంటున్నదని అరవింద్ సుబ్రమణ్యం వ్యాఖ్యనించారు. ఇదేమి సాధారణ మందగమనం కాదు..అతిపెద్ద సంక్షోభం ఎదుర్కొక తప్పదని అరవింద్ హెచ్చరించారు.