ప్రసవం ముందు వరకూ డ్యూటీ చేసిన జైపూర్ మేయర్

Jaipur Mayor : కొద్దిగంటల్లో ప్రసవం కాబోతోంది. కానీ..అప్పటికీ ఇంకా డ్యూటీ చేశారు. ప్రజాసేవలకు అసలైన అర్థం చెప్పారు. నిండు గర్భంతో ఉన్న ఆమె అధికారికంగా బాధ్యతలు నిర్వర్తించారనే వార్త వైరల్ అవుతోంది. ఈ ఘటన జైపూర్ లో చోటు చేసుకుంది. మేయర్ గా డాక్టర్ సౌమ్య గుర్జర్ పై ప్రశంసలు కురుస్తున్నాయి. సౌమ్య జైపూర్ నిగమ్ (గ్రేటర్) మేయర్ గా ఉన్నారు.

రాజస్థాన్ పదవిలో ఉన్నప్పుడు ఒక బిడ్డకు జన్మనిచ్చారామె. గర్భంతో ఉన్న సమయంలోనే జైపూర్ మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల్లో పోటీ చేసి, ఏకంగా మేయర్‌గా ఎన్నికయ్యారు. రెండోసారి గర్భం దాల్చారు. అయినా..క్రమం తప్పకుండా మేయర్ కార్యాలయానికి వచ్చి విధులు నిర్వర్తించారు. నిండు గర్భిణీగా ఉన్నా..2021, ఫిబ్రవరి 10వ తేదీ బుధవారం రాత్రి పొద్దుపొయే వరకు పని చేశారు. మున్సిపల్ కార్పొరేషన్ మీటింగ్ లో పాల్గొన్నా..ప్రసవనొప్పులతో 12.30 గంటలకు ఆసుపత్రిలో చేరినట్లు సౌమ్య ట్వీట్ చేశారు. దేవుడి ఆశీస్సులతో గురువారం ఉదయం ప్రసవమైందని తెలిపారు.

జనవరి 30వ తేదీన ఆయుష్మాన్ భారత్ – మహాత్మ గాంధీ రాజస్థాన్ ఆరోగ్య బీమా పథకం ప్రారంభోత్సవంలో ఆమె పాల్గొన్నారు. గత నెలలోనే మేయర్ హోదాలో మున్సిపల్ కార్పొరేషన్ బడ్జెట్ ను సమర్పించారు. ఫిబ్రవరి 07వ తేదీ రాజస్థాన్ లో కేంద్ర మంత్రి స్మృతి ఇరానీ పర్యటనలో కూడా పాల్గొన్నారు. గర్భంతో ఉన్న సమయంలో..పని చేయడం చాలా ఉత్తేజంగా అనిపించిందని, ఇది ఒక సవాల్ గా కూడా ఉందన్నారు. క్రమశిక్షణతో బాధ్యతలు నిర్వరిస్తూ..అందరి ప్రశంసలు దక్కించుకంటున్నారు.