INDIA: అందుకే పార్లమెంటు ప్రత్యేక సమావేశాలు నిర్వహిస్తున్నారు.. వస్తాం: కాంగ్రెస్

పార్లమెంటు ప్రత్యేక సమావేశాల్లో ఏ అంశాలపై చర్చిస్తామన్న విషయంపై తమకు ఎలాంటి సమాచారమూ ఇవ్వలేదని చెప్పారు.

Jairam Ramesh

INDIA – Jairam Ramesh: భారత జాతీయ అభివృద్ధి సమ్మిళిత కూటమి (INDIA) వచ్చే లోక్‌సభ ఎన్నికల్లో బీజేపీని ఎదుర్కోవడానికి ప్రణాళికలు వేసుకుంటున్న వేళ కేంద్ర సర్కారు దేశం పేరును మార్చుతుండడం ఆసక్తికరంగా మారింది. పార్లమెంటు ప్రత్యేక సమావేశాల్లో ఇండియా పేరును భారత్‌గా మార్చడానికి బిల్లును ప్రవేశ పెట్టనున్నట్లు ప్రచారం జరుగుతోంది.

పార్లమెంటు ప్రత్యేక సమావేశాలపై కాంగ్రెస్ ఎంపీ జైరాం రమేశ్ మరోసారి స్పందించారు. ప్రతిపక్షాల కూటమి ఇండియా సమావేశం నుంచి ప్రజల దృష్టిని మళ్లించేందుకే ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ, ఆయన సహచరులు కలిసి ఐదు రోజుల పార్లమెంటు ప్రత్యేక సమావేశాలను నిర్వహిస్తున్నారని జైరాం రమేశ్ అన్నారు.

పార్లమెంటు ప్రత్యేక సమావేశాల్లో ఏ అంశాలపై చర్చిస్తామన్న విషయంపై తమకు ఎలాంటి సమాచారమూ ఇవ్వలేదని చెప్పారు. ఈ ప్రత్యేక సమావేశాల్లో పాల్గొనాలని ఇవాళ కాంగ్రెస్ పార్టీ నిర్ణయం తీసుకుందని అన్నారు. అయితే, ప్రజల సమస్యలపై చర్చలు జరగాలని చెప్పారు. ఈ పార్లమెంటు ప్రత్యేక సమావేశాల్లో మరి కొన్ని కీలక బిల్లులను కూడా ప్రవేశపెట్టనున్నట్లు తెలుస్తోంది.

7 Countries : పేరు మార్చుకున్న 7 దేశాలు ఇవే.. అసలు దేశం పేరు ఎందుకు మారింది? కారణాలు ఏంటి?