Open air floating Theatre :సరస్సు మధ్యలో తేలియాడే థియేటర్‌..హౌస్‌బోట్లలో కూర్చొని సినిమా చూడొచ్చు

శ్రీనగర్‌లోని దాల్‌ సరస్సుపై ఓపెన్‌ ఎయిర్‌ ఫ్లోటింగ్‌ థియేటర్‌ పర్యాటకులను ఆకట్టుకుంటోంది.హౌస్ బోట్లలో దర్జాగా కూర్చుని సినిమా చూస్తు పర్యాటకులు ఆనందాన్ని ఆస్వాదిస్తున్నారు.

Open air floating Theatre : సరస్సు మధ్యలో హౌస్ బోట్లలో దర్జాగా కూర్చుని పెద్ద ధియేటర్ లో సినిమా చూస్తే..ఆ మాజాయే వేరు కదూ. అటువంటి మజాను అనుభవించాలంటే చల్లని అందాల కశ్మీర్ వెళ్లాల్సిందే. అందానికి మారుపేరు అయిన దాల్ సరస్సు మధ్యలో తేలియాడే థియేటర్ లో సినిమా చూస్తుంటే..ఓపక్కన చల్లటి గాలి..మరోపక్క సినిమా చూసి తీరాల్సిందే. అటువంటి కిక్ కోసం కశ్మీర్ లోనే ధాల్ సరస్సులో ఏర్పాటు చేసిన ఓపెన్‌ ఎయిర్‌ ఫ్లోటింగ్‌ థియేటర్‌ లో బిగ్ స్క్రీన్ పై సినిమా పర్యాటకుల్ని ఎంతగానో ఆకట్టుకుంటోంది. కశ్మీర్ అందాల నడుమ దర్జాగా హౌస్‌బోట్లలో కూర్చొని సినిమా చూస్తుంటే..ఆ ఆనందాన్ని ఆస్వాదించాలే గానీ మాటల్లో చెప్పలేం. కశ్మీర్‌లో పర్యాటక రంగాన్ని ప్రోత్సహించడం కోసం దాల్ సరస్సులో ఈ థియేటర్ ను ఏర్పాటు చేశారు.

Read more: Highest Theatre: మైనస్ 28 డిగ్రీస్‌.. 11,562 అడుగుల ఎత్తులో మూవీ థియేటర్! 

జమ్మూ కశ్మీర్‌ రాజధాని శ్రీనగర్‌లోని దాల్‌ సరస్సుపై ఏర్పాటు చేసిన ఓపెన్‌ ఎయిర్‌ ఫ్లోటింగ్‌(తేలియాడే) థియేటర్‌ పర్యాటకులను విశేషంగా ఆకట్టుకుంటోంది. కశ్మీర్‌లో పర్యాటక రంగాన్ని ప్రోత్సహించడం కోసం శ్రీనగర్‌ స్మార్ట్‌ సిటీ, జమ్మూ కశ్మీర్ యూత్‌ మిషన్‌తో కలిసి రాష్ట్ర పర్యాటక శాఖ ఈ వినూత్న ఆలోచనకు శ్రీకారం చుట్టింది. దాల్ సరస్సును సందర్శించేందుకు హౌస్‌బోట్లలో వచ్చిన పర్యాటకులు సరస్సు మధ్యలోనుంచి స్ర్కీన్‌పై సినిమాలను చూసే అవకాశాన్ని కల్పించింది. ఐకానిక్‌ వేడుకలను పురస్కరించుకుని జమ్మూ కశ్మీర్ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి అరుణ్‌ కుమార్‌ మెహతా ఈ ఫ్లోటింగ్‌ థియేటర్‌ను ప్రారంభించారు.

సరస్సు మధ్యలో హౌస్‌బోట్లలో కూర్చొని పెద్ద తెరపై సినిమా చూడడం సినిమా ప్రేమికులకు సరికొత్త అనుభూతినిస్తుందని పర్యాటక శాఖ అధికారులు చెబుతున్నారు. ఈ ప్రారంభోత్సవం కార్యక్రమంలో భాగంగా టూరిస్టులు, స్థానిక కళాకారుల కోసం ‘కశ్మీర్ కి కలి’ అనే బాలీవుడ్ సినిమాను థియేటర్‌పై ప్రదర్శించారు.

Read more : SI Run on Road : యూనిఫాం తీసి చెత్తలో పారేసి రోడ్డుపై పరుగులు పెట్టిన ఎస్సై..

అలటానికి బాలివుడ్ హిట్ పెయిర్ షమ్మీకపూర్‌, షర్మిలా ఠాగూర్ నటించిన కశ్మీర్ కి కలి. ప్రాణ్‌ వంటి దిగ్గజ స్టార్లు నటించిన ఈ సినిమా 1964లో విడుదలై భారీ విజయాన్ని అందుకుంది. ఈ సినిమాతోనే షర్మిలా వెండితెరపైకి అడుగుపెట్టడం విశేషం. శక్తి సమంతా దర్శకత్వంలో రూపొందిన ఈ సినిమాని ఎక్కువ భాగాన్ని కశ్మీర్‌లోనే చిత్రీకరించారు. అందుకే కశ్మీర్ లోని దాల్ సరస్సులో ఈ సినిమానే ప్రదర్శించారు.

ట్రెండింగ్ వార్తలు