SI Run on Road : యూనిఫాం తీసి చెత్తలో పారేసి రోడ్డుపై పరుగులు పెట్టిన ఎస్సై..

దొంగల్నీ, నేరస్థుల్ని పట్టుకోవటానికి పరుగు పెట్టాల్సిన ఎస్సై ఏసీబీ అధికారుల్ని చూసి ఒంటిమీదున్న యూనిఫాం తీసేసి రోడ్డుపై పరుగులు పెట్టాడు.ఎందుకంటే..

SI Run on Road : యూనిఫాం తీసి చెత్తలో పారేసి రోడ్డుపై పరుగులు పెట్టిన ఎస్సై..

Remove The Uniform And Run The Si On The Road

Remove the uniform and run the SI on the road : ఏసీబీ అధికారుల్ని చూసీ ఓ ఎస్సై రోడ్లపై పరుగు లంఘించుకున్నాడు. పరుగు పెడుతు పెడుతు తన ఒంటిపై ఉన్న ఖాకీ యూనిఫాం తీసేసి మరీ పరుగు పెట్టిన ఘటన కర్ణాటకలోని తుముకూరులో జరిగింది. పారిపోతున్న దొంగల్నీ, నేరస్థుల్ని పట్టుకోవటానికి పరుగు పెట్టాల్సిన పోలీసాయన ఏసీబీ అధికారుల్ని చూసి ఎంతకు పరుగు పెట్టాడో తెలుసుకుందాం..

తుమకూర్‌కు 30 కిలోమీటర్ల దూరంలో తుముకూరు గుబ్బిన్ తాలూకాలోని చంద్రశేఖర్ పొరాకు చెందిన పోలీసులు కుటుంబ వ్యాజ్యం కేసుకు సంబంధించిన కేసు విషయంలో చంద్రన్న అనే వ్యక్తి వాహనాన్ని సీజ్ చేశారు. కానీ రూ. 28 వేలు లంచం ఇస్తే వాహనాన్ని విడిచిపెట్టేస్తానని ఎస్సై సోమశేఖర్ చంద్రన్నతో బేరాలాడాడు. దానికి సంబంధించి బేరాలు ఆడటానికి నయాజ్ అహ్మద్ అనే కానిస్టేబుల్‌ కు పురమాయించాడు. దీంతో బాధితుడు చంద్రన్న వెంటనే ఏసీబీ అధికారులను ఆశ్రయించాడు. ఈ విషయం విన్న ఏసీబీ ఎస్సై కోసం వారు కాపుకాశారు.

Read more : పోలీసులకు దొరక్కుండా పేడలో దాక్కున్న దొంగ : ప్లీజ్ స్నానం చేశాక అరెస్ట్ చేయండీ..

ఏసీబీ అధికారుల ప్లాన్ ప్రకారం కానిస్టేబుల్ కు చంద్రన్న నుంచి రూ. 12 వేలు తీసుకుంటున్న కానిస్టేబుల్‌ను బుధవారం (నవంబర్3,2021) రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుకున్నారు. ఎస్సై తీసుకోమంటేనే తాను లంచం తీసుకున్నానని కానిస్టేబుల్ చెప్పడంతో అతడిని తీసుకుని స్టేషన్‌కు బయలుదేరారు. ఈ క్రమంలో తనను పట్టుకోవటానికి ఏసీబీ అధికారులు వస్తున్నారని తెలుసుకున్న ఎస్సై సోమశేఖర్ పారిపోవాలనుకున్నాడు. అలా పారిపోతు పారిపోతు ఏసీబీ అధికారులు తనను గుర్తించకుండా ఉండేందుకు తన ఖాకీ షర్టు తీసేసి అక్కడే ఉన్న చెత్తబుట్టలో పారేసి రోడ్డుపైకి వచ్చి పరుగులు తీశాడు.

Read more :Drones To Rescue Pigeon : డ్రోన్‌కు కత్తి కట్టి..కరెంట్ వైర్లకు చిక్కుకున్న పావురాన్ని కాపాడిన పోలీసులు

అదే సమయంలో అక్కడికి చేరుకున్న ఏసీబీ అధికారులు అతడు పారిపోవటాన్ని గుర్తించారు. అంతే ఎస్సైను పట్టుకోవటానికి వారు కూడా సినీ ఫక్కీలో వెంబడించారు. అలా దాదాపు కిలోమీటరు దూరం పరుగు పెట్టాక ఎట్టకేలకు స్థానికుల సాయంతో ఎస్సై సోమశేఖర్‌ను పట్టుకున్న ఏసీబీ అధికారులు అరెస్ట్ చేసి రిమాండ్‌కు తరలించారు. అలా ఏసీబీ విచారణలో ఎస్సై తాను లంచం తీసుకోవటానికి యత్నించానని అంగీకరించాడు. దీంతో కేసు నమోదు చేసుకున్న ఏసీబీ అధికారులు దర్యాప్తు కొనసాగిస్తున్నారు. గతంతో ఎవరెవరి వద్ద లంచం ఎంతెంత తీసుకున్నాడు అనేకోణంలో దర్యాప్తు కొనసాగిస్తున్నారు.