Drones To Rescue Pigeon : డ్రోన్‌కు కత్తి కట్టి..కరెంట్ వైర్లకు చిక్కుకున్న పావురాన్ని కాపాడిన పోలీసులు

డ్రోన్ సహాయంతో పోలీసులు ఓ పావురం ప్రాణాలు కాపాడారు. కరెంట్ వైర్లకు చిక్కుకుపోయిన పావురాన్ని డ్రోన్ తో రక్షించారు.

Drones To Rescue Pigeon : డ్రోన్‌కు కత్తి కట్టి..కరెంట్ వైర్లకు చిక్కుకున్న పావురాన్ని కాపాడిన పోలీసులు

Police Use Drones To Rescue Pigeon

Police Use Drones To Rescue Pigeon  :  ప్రస్తుత పరిస్థితుల్లో డ్రోన్ల వాడకం విరివిగా పెరిగింది..అన్ని రంగాల్లోనూ డ్రోన్‌ టెక్నాలజీని వాడుతున్నారు. వ్యవసాయ రంగం మొదలుకొని రక్షణ రంగం వరకు అన్నింటిలోను..డ్రోన్ల వాడకం బాగా పెరిగింది. మెడిసిన్స్, ఆహారం తరలింపులకు ఉపయోగిస్తున్నారు. వెడ్డింగ్ షూట్లలో ఇక డ్రోన్ల వాడకం మామూలుగా లేదు. అలాగే వ్యవసాయ రంగంనుంచి రక్షణ రంగం వరకు అన్ని సేవలకు డ్రోన్లను ఉపయోగం బాగా పెరిగింది. అంతేకాదు మూగ జీవుల్ని కాపాడటానికి కూడా డ్రోన్లు వినియోగించటం ఇప్పుడు వైరల్ గా మారింది. కరెంట్ వైర్ల మధ్య చిక్కుకున్న ఓపావురాన్ని కాపాడానికి పోలీసులు డోన్ ను ఉపయోగించారు. కాళ్లకు దారం చుట్టుకుని కరెంట్ వైర్ల మధ్య చిక్కుకుని ప్రాణాలతో పోరాడుతున్న ఓపావురాన్ని పోలీసులు డ్రోన్ సహాయంతో కాపాడిన ఘటన పెరు దేశ రాజధాని లీమాలో జరిగింది.

Read more : Medicine From The Sky : దేశంలోనే తొలిసారి తెలంగాణలో డ్రోన్లతో వ్యాక్సిన్ల తరలింపు

లీమాలో పోలీసులు డ్రోన్‌ సాయంతో ఓ పావురం ప్రాణాలు కాపాడి శెభాష్అనిపించుకున్నారు. ఓ పావురం కాళ్లకు దారం చుట్టుకుంది. అలా ఎగురుతు వచ్చిన ఆ పావురం విద్యుత్ హైటెన్షన్‌ వైర్‌కు చిక్కుకుంది. పాపం అక్కడనుంచి బయటకు రావటానికి ఆ పావురం నానా పాట్లు పడింది. కానీ దాని యత్నాలు ఫలించలేదు. అలా కిందికి వేలాడుతూ.. ఎగరలేక విలవిలాడింది.

Read more : Drones Drop Food, Water : కుక్కలకు డ్రోన్ల ద్వారా ఆహారం, నీరు సరఫరా..ఎందుకంటే?

పావురం పరిస్థితి గమనించిన పోలీసులు ఆ పావురాన్ని రక్షించడానికి రంగంలోకి దిగారు. ఓ డ్రోన్‌కు కత్తి కట్టి కరెంట్‌ వైర్ల మధ్య డ్రోన్ ను అత్యంత జాగ్రత్తగా ఆపరేట్‌ చేస్తూ నెమ్మదిగా పావురం కాలుకున్న దారాన్ని కట్‌చేసేలా చేశారు. దీంతో పావురం ప్రాణాలతో సురక్షితంగా కిందపడింది. ఆతరువాత దాన్ని చేతుల్లోకి తీసుకున్న పోలీసులు దాని చుట్టుకొని ఉన్న మొత్తం దారాన్ని తొలగించి దానికి విముక్తి కలిగించారు. పంజరంలో వేశారు. దీనికి సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారింది.