పోలీసులకు దొరక్కుండా పేడలో దాక్కున్న దొంగ : ప్లీజ్ స్నానం చేశాక అరెస్ట్ చేయండీ..

  • Published By: nagamani ,Published On : December 4, 2020 / 12:20 PM IST
పోలీసులకు దొరక్కుండా పేడలో దాక్కున్న దొంగ : ప్లీజ్ స్నానం చేశాక అరెస్ట్ చేయండీ..

England theif : అతనో దొంగ..పట్టుకోవటానికి పోలీసులు తరుముకొస్తున్నారు. ఎక్కడన్నా దాక్కోవాలనుకున్నాడు. ఎక్కడా దాక్కోవాలా? అని చుట్టుపక్కల చూస్తున్నాడు. అలా అతనికి ఓ చోట గోతిలో ఉన్న పెద్ద పేడ గుట్ట కనిపించింది. అంతే ఏమాత్రం ఆలోచించకుండా ఆ పేడ గుట్టగొయ్యిలో దూకి దాక్కున్నాడు.



ఓ పక్క పేడ దారుణంగా కంపుగొడుతోంది. తట్టుకోలేకపోతున్నాడు. ఆ కంపుకు కళ్లు తిరుగుతున్నాయి. మరోపక్క పోలీసులు తరుముకొస్తున్నారు. కానీ తప్పదు అలాగే ఊపిరి బిగబట్టుకుని ఆ పేడలోనే దాక్కున్నాడు. కానీ పోలీసులు వదల్లేదు అతన్ని వెతుక్కుంటూ వచ్చి ఆ పేడ గోతిలో ఉన్నాడని గుర్తించి బైటకు లాగారు.అనంతరం బేడీలు వేసి మరీ అరెస్ట్ చేశారు. అరెస్ట్ అయినా గానీ సమయానికి పోలీసులు రాకపోతే..అతడు ఆ పేడగోతిలోనే సజీవసమాధి అయ్యేవాడే.



ఈ పేడగుట్టలో దొంగగారి గురించి వివరాల్లోకి వెళితే..ఇంగ్లాండ్‌లోని ససెక్స్ కౌంటీలో ఓ వ్యక్తి కారును దొంగిలించాడు. ఈ విషయం తెలుసుకున్న పోలీసులు అతడుఉన్న చోటిని గుర్తించి వెంబడించారు. పోలీసులు తనను పట్టుకోవటానికి వెంబడిస్తున్నాడని తెలుసుకున్న ఆ దొంగ వారి నుంచి తప్పించుకోవటానికి పేడతో నిండి ఉన్న ఆరు అడుగుల లోతు ఉణ్న ఓ గోతిలోకి దూకాడు.



పోలీసులనుంచి తప్పించుకోవాలనుకున్నాడు. కానీ..పాపం ఆ కంపుకు కళ్లు తిరిగాయి. ఆ దీంతో అతను ఊబిలో కూరుకున్నట్లు పేడలో దాదాపు మునిగిపోయాడు. ఇది గమనించిన పోలీసులు అతడిని ఆ గొయ్యి నుంచి బయటకు తీశారు. అలా అతడిని శుభ్రం చేయకుండానే చేతికి బేడీలు వేశారు. ఆ ఫొటో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.


దీంతో పాపం ఆ కారు దొంగ అలా ఎట్టకేలకూ పోలీసులకు చిక్కాడు. దీంతో అతను పోలీసుల్ని బతిమాలుకున్నాడు. ‘‘ఈ పేడ కంపు భరించలేకపోతున్నా.. స్నానం చేశాక అరెస్టు చేయండి అని బతిమాలుకున్నారు.కానీ పోలీసులు వినలేదు. చేతులకు గ్లవ్స్ వేసుకుని మరీ అతడి చేతికి బేడీలు వేసి మరీ లాక్కుపోయారు. ఈ ఫొటో చూసినవారంతా ఎవరికి తోచినవాళ్లు ఫన్నీ కామెంట్లు చేస్తున్నారు. ‘‘అతడు అరెస్ట్ అయినా గానీ ఫరవాలేదు బతికి బైటపడ్డాడు దానికి పోలీసులకు రుణపడి ఉండాలి. లేకపోతే.. అతడు ఆ పేడలోనే ప్రాణాలు విడిచేవాడని అంటున్నారు.



కాగా..నిల్వ ఉంచిన పేడలో మీథేన్, కార్బన్‌ డైయాక్సైడ్, అమ్మోనియా, హైడ్రోజన్ సల్ఫైడ్‌లు ఉంటాయి. వాటిని పీలిస్తే స్పృహ కోల్పోయే ప్రమాదముంటుంది.