Jammu Kashmir Mysterious Deaths : జమ్ముకశ్మీర్ లోని రాజౌరిని అంతు చిక్కని మరణాలు వెంటాడుతున్నాయి. జిల్లాలోని బుధాల్ గ్రామంలో నెలన్నర వ్యవధిలో 17మంది అనుమానాస్పద రీతిలో చనిపోయారు. అయితే, ఈ మరణాలకు కారణాలు ఏంటి అన్నది అంతుచిక్కడం లేదు. జ్వరం, ఒళ్లు నొప్పులు, వాంతులు, స్పృహ కోల్పోవడం లాంటి సమస్యలతో అక్కడి ప్రజలు ఆసుపత్రుల్లో చేరుతున్నారు. కొన్ని రోజుల్లోనే మరణిస్తున్నారు.
ఆ అంతుచిక్కని మరణాలకు గల కారణాలను గుర్తించేందుకు వైద్యరోగ్య శాఖ ప్రయత్నాలు చేస్తోంది. బాధితుల నుంచి నమూనాలు సేకరించి దేశవ్యాప్తంగా ఉన్న అత్యున్నత ల్యాబ్ లకు పంపింది. పుణెలోని ఎన్ఐవీ, ఢిల్లీలోని ఎన్ సీ వీసీ, లక్నోలోని ఎన్ఐటీఆర్, గ్వాలియర్ లోని డీఆర్డీఈ తో పాటు ఛండీగఢ్, జమ్ములలో ఉన్న రీసెర్చ్ ల్యాబుల్లో పరీక్షించినప్పటికీ.. వైరస్ లేదా బ్యాక్టీరియా కారకాలు లేవని తేలింది.
ఐఐటీఆర్ నిర్వహించిన పరీక్షల్లో మాత్రం ఆ నమూనాల్లో విషపదార్ధాలు ఉన్నట్లు గుర్తించింది. దీంతో మరింత అప్రమత్తమైన కేంద్ర ప్రభుత్వం అన్ని కోణాల్లో దర్యాఫ్తు చేసేందుకు ప్రత్యేక బృందాలు ఏర్పాటు చేసింది.
రాజౌరీలో మరణాలు, అక్కడి పరిస్థితులను దర్యాఫ్తు చేసి కారణాలు తెలుసుకునేందుకు తక్షణమే కేంద్ర ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయాలని కేంద్రం ఆదేశించింది. హోంశాఖకు చెందిన సీనియర్ అధికారి ఈ బృందానికి నేతృత్వం వహిస్తున్నారు. ఆరోగ్య కుటుంబ సంక్షేమ శాఖ, వ్యవసాయ శాఖ, ఎరువులు, రసాయనాల శాఖ, జలవనరుల శాఖకు చెందిన నిపుణులు ఈ బృందంలో సభ్యులుగా ఉంటారు. వీరికి పశుపోషణ, ఫోరెన్సిక్ సైన్స్ ల్యాబ్స్, ఫుడ్ సేఫ్టీ అధికారులు సహకరిస్తారు.
అసలేం జరిగింది?
* రాజౌరీ జిల్లా బుధాల్ లో డిసెంబర్ 7న సహఫంక్తి భోజనం
* భోజనం తిని అస్వస్థతకు గురైన ఒకే కుటుంబానికి చెందిన ఏడుగురు
* అస్వస్థతకు గురైన ఏడుగురిలో చికిత్స పొందుతూ ఐదుగురు మృతి
* డిసెంబర్ 12న మరో కార్యక్రమంలో భోజనం చేసి 9మంది అస్వస్థత
* తొమ్మిది మందిలో చికిత్స పొందుతూ మరో ముగ్గురు దుర్మరణం
* జనవరి 12న మరో ఘటనలో అస్వస్థతకు గురైన 10మంది
* నెల్లనర్న రోజుల వ్యవధిలోనే అనుమానాస్పదంగా 17మంది మృతి
Also Read : అధ్యక్షుడిగా ట్రంప్ ఫస్ట్ స్పీచ్.. అమెరికాలో స్వర్ణయుగం ప్రారంభమైంది.. ఇంకా ఏమన్నారంటే?