Childrens Day 2023 : ‘ప్రతి బిడ్డకు హక్కు’ చిన్నారుల హక్కుల పరిరక్షణే ధ్యేయంగా బాలల దినోత్సవం

జవహర్ లాల్ నెహ్రూకి బాలలన్నా.. గులాబీ పూవులన్నా ఎంతో ఇష్టం. పిల్లలను జాతి సంపదగా చెబుతుండేవారాయన. ఆయన జయంతి రోజు 'బాలల దినోత్సవాన్ని' జరుపుకుంటాం. ఈ సందర్భంలో ఆ మహనీయుని స్మరిద్దాం. బాలలందరికీ శుభాకాంక్షలు చెబుదాం.

Childrens Day 2023

Childrens Day 2023 : భగవంతుడు ప్రత్యక్షమై నీకేం వరం కావాలంటే చాలామంది తమ బాల్యం తిరిగి ఇవ్వమని అడుగుతామంటారు. భగవంతుడు ఇచ్చిన గొప్పవరం బాల్యం. చాలా దేశాల్లో బాలల దినోత్సవం నిర్వహిస్తుంటారు. భారతదేశంలో మాత్రం ఏటా నవంబర్ 14 న ‘బాలల దినోత్సవం’ జరుపుకుంటాం. చాచా నెహ్రూ జయంతి రోజున ఈ దినోత్సవం నిర్వహిస్తారు. ఈ రోజు ఆ మహానుభావుడికి నివాళులు అర్పిద్దాం. బాలలందరికి శుభాకాంక్షలు చెబుదాం.

భారతదేశానికి స్వాతంత్ర్యం వచ్చిన తర్వాత మొట్టమొదటి ప్రధానిగా పనిచేశారు జవహర్ లాల్ నెహ్రూ. ఆయన జన్మించిన రోజున బాలల దినోత్సవం జరుపుకోవడానికి గల కారణం అందరికీ తెలిసిందే. స్వాతంత్ర్యోద్యమ కాలంలో నెహ్రూ చాలా జీవితం జైళ్లలోనే గడిపారు. ఆ సమయంలో తన ఏకైక కుమార్తె ఇందిరా ప్రియదర్శినితో ఎక్కువకాలం గడపలేకపోయారట. నెహ్రూకి పిల్లలన్నా, గులాబీ పూవులన్నా చాలా ఇష్టం. పిల్లలను జాతి సంపదలుగా నెహ్రూ చెబుతూ ఉండేవారు.  ఆయన పాలనలో దేశంలో బాలల అభివృద్ధికి ఎంతో కృషి చేశారు. అందుకే ఆయన పుట్టినరోజున మన దేశంలో బాలల పండుగ నిర్వహిస్తున్నారు. ఈరోజు చాచా నెహ్రూను తలుచుకుని పిల్లలతో ప్రత్యేక కార్యక్రమాలు నిర్వహిస్తారు.

Modi Praises Nehru: నెహ్రూపై మోదీ ప్రశంసలు.. అయినా చప్పట్లు కొట్టని కాంగ్రెస్.. ఆసక్తికరంగా సోనియా రియాక్షన్

1954 కి ముందు భారతదేశంలో అక్టోబర్ నెలలో బాలల దినోత్సవాన్ని నిర్వహించేవారు. ఐక్యరాజ్యసమితి నిర్ణయించిన ప్రకారం మొదటిసారి 1954 లో ప్రపంచమంతటా నిర్వహించారు. 1989 లో పిల్లల హక్కులపై నవంబర్ 14 న ఐరాసా ఓ బిల్లును ఆమోదించింది. 191 దేశాలు ఆ బిల్లును ఆమోదిస్తూ సంతకాలు పెట్టాయి. ప్రపంచ వ్యాప్తంగా పిల్లల సంక్షేమం కోసం పలు చర్యలు చేపట్టడమే లక్ష్యంగా ఈ దినోత్సవాన్ని నిర్వహిస్తూ వస్తున్నారు. చైనాలో జూన్ 1 న, పాకిస్తాన్ లో నవంబర్ 20 న, జపాన్ లో మే 5 న, దక్షిణ కొరియాలో మే 5 న, పోలాండ్ లో జూన్ 1 న, శ్రీలంకలో అక్టోబర్ 1 న ఇలా ఆయా దేశాల్లో బాలల దినోత్సవాన్ని ఘనంగా నిర్వహిస్తారు.

బాలల దినోత్సవం చిన్నారులకు సురక్షితమైన, ఆరోగ్యకరమైన బాల్యం అందించే ప్రాముఖ్యతను నొక్కి చెబుతుంది. పిల్లల హక్కులను ప్రోత్సహించడం, వారి విద్య, శ్రేయస్సుకి పాటుపడటంతో పాటు, పోషకాహారం, ఇంట్లో సురక్షితమైన వాతావరణం అందించడం వంటి బాధ్యతలను గుర్తు చేస్తుంది.  పేదరికం, నిరక్షరాస్యత, ఆరోగ్య సంరక్షణ, బాల కార్మికులుగా మారడం వంటి పిల్లలు ఎదర్కుంటున్న సవాళ్లపై అవగాహన పెంచుతుంది.

Asaduddin Owaisi : నెహ్రూ, సర్దార్ పటేల్ ముస్లింలపై వివక్ష చూపించారు- మహిళా రిజర్వేషన్ బిల్లుపై ఎంపీ అసదుద్దీన్ ఓవైసీ సంచలన వ్యాఖ్యలు

2023 బాలల దినోత్సవం  ‘For every child, every right’ థీమ్‌తో ముందుకు తీసుకెళ్తున్నారు.  బాలల శారీరక, మానసిక వికాసం పెంపొందేలా వ్యక్తులు, సంఘాలు ప్రభుత్వాలు కృషి చేయాల్సిన అవసరం ఎంతైనా ఉంది. అందుకు ఈరోజు సరైన సందర్భంగా చెప్పాలి.