జమ్మూకశ్మీర్‌లోని సోపోర్ జిల్లాలో బుధవారం (జులై 1,2020)ఉదయం భద్రతా బలగాలు, ఉగ్రవాదులకు మధ్య ఎదురుకాల్పుల్లో ఓ హృదయవిదారక దృశ్యం..అందరినీ కంటతడి పెట్టిస్తోంది. భద్రతా బలగాలు, ఉగ్రవాదులకు మధ్య ఎదురుకాల్పుల్లో ఓ పౌరుడు ప్రాణాలు కోల్పోయాడు. అప్పటి వరకూ తాత…మూడేళ్ల మనుమడితో కలిసి చక్కగా కబుర్లు చెప్పుకుంటూ వెళ్లుతున్నారు. సరిగ్గా అప్పుడే ఉగ్రవాదుల తుపాకులు ఘర్జించాయి. ఓ తుపాకీలోంచి దూసుకొచ్చిన తూటా ఆ తాత శరీరంలోకి దూసుకుపోయింది.దీంతో అతను అక్కడికక్కడే కుప్పకూలిపోయి ప్రాణాలు వదిలాడు. దీంతో ఏం జరిగిందో కూడా తెలియని మూడేళ్ల పసిబాలుడు తాతని లేపేందుకు యత్నించాడు. కానీ తండ్రి లేవలేదు. దీంతో ఆ పసివాడు తాత మృతదేహంమీద కూర్చుని గుక్కపట్టి ఏడుస్తున్నాడు.
ఓపక్క తుపాకుల గర్జింపులు..మరోపక్క తండ్రి మృతదేహంపై కూర్చుని ఏడుస్తున్న ఆ బాలుడిని ఓ జవాను చూశాడు. ఏ తూటా వచ్చి ఆ పసివాడ్ని పొట్టన పెట్టుకుంటుందేమోనని భయపడిపోయాడు. కాసేపు అలాగే ఉంటే తూటాకు ఆ బిడ్డ బలైపోయేవాడే. సరిగ్గా అప్పుడే ఓ తన ప్రాణాలను అడ్డువేసిన ఒక్క ఉదుటున బాలుడి దగ్గరకు పరుగెత్తుకుంటూ వచ్చి బిడ్డను అక్కున చేర్చుకున్నాడు. వెంటనే సురక్షిత ప్రాంతానికి తీసుకెళ్లాడు. ఆ బాలుడి పేరు నిహాన్‌గా గుర్తించారు. వెంటనే వారి కుటుంబ సభ్యులకు సురక్షితంగా చేర్చారు.
ఈ ఎన్ కౌంటర్ లో మరో ముగ్గురు సీఆర్పీఎఫ్ జవాన్లు తీవ్రంగా గాయపడ్డారు. వీరిలో ఇద్దరి పరిస్థితి విషమంగా ఉన్నట్లు అధికారులు తెలిపారు.కశ్మీర్ లో పౌరుల ప్రాణాలు ఇలా తుపాకుల తూటాల మధ్య ఎప్పుడు పోతాయోతెలీక ఇలా ఉంటాయి అంటూ ఓ వ్యక్తి చేసిన ట్వీట్ కు సంబంధించని ఈ ఫోటో చూసినవారందని మనస్సులను కలిచివేస్తోంది.
Read:భారత్‌లో 50ఏళ్లలో 4.58 కోట్ల మంది మహిళలు మిస్సింగ్