JDS and BJP: ఢిల్లీలో కుదిరిన దక్షిణాది పొత్తు.. ఎన్డీయేలో చేరిన జేడీఎస్. పొత్తు అనంతరం ఇరు పార్టీల స్పందనేంటంటే?

ఈ ఏడాది మేలో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ 135 సీట్లు గెలుచుకుంది. దీంతో బీజేపీ అధికారాన్ని కోల్పోవాల్సి వచ్చింది. బీజేపీ 66 సీట్లు, జేడీఎస్ 19 సీట్లు గెలుచుకున్నాయి

JDS and BJP: ఢిల్లీలో కుదిరిన దక్షిణాది పొత్తు.. ఎన్డీయేలో చేరిన జేడీఎస్. పొత్తు అనంతరం ఇరు పార్టీల స్పందనేంటంటే?

Updated On : September 22, 2023 / 7:19 PM IST

Karnataka Politics: మాజీ ప్రధానమంత్రి హెచ్‌డీ దేవెగౌడ పార్టీ జనతాదళ్ సెక్యులర్ పార్టీ.. భారతీయ జనతా పార్టీ నేతృత్వంలోని నేషనల్ డెమోక్రటిక్ అలయన్స్ (ఎన్‌డీఏ)లో చేరనున్నట్లు ప్రకటించింది. శుక్రవారం హోంమంత్రి అమిత్ షాను జేడీఎస్ నాయకుడు హెచ్‌డీ కుమారస్వామి ఢిల్లీలో కలిశారు. ఈ సమావేశంలో బీజేపీ అధ్యక్షుడు జేపీ నడ్డా కూడా ఉన్నారు. లోక్‌సభ ఎన్నికల దృష్ట్యా కర్ణాటకలో సీట్ల పంపకంపై ముగ్గురు నేతల మధ్య చర్చ జరిగినట్లు విశ్వసనీయ వర్గాల సమాచారం.

సమావేశం అనంతరం బీజేపీ అధ్యక్షుడు జేపీ నడ్డా మాట్లాడుతూ నేషనల్ డెమొక్రటిక్ అలయన్స్(ఎన్డీఏ)లో జేడీఎస్ చేరిందని తెలిపారు. ఈ విషయమై ఆయన సోషల్ మీడియా ద్వారా నడ్డా స్పందిస్తూ.. “హోం మంత్రి అమిత్ షా సమక్షంలో కర్ణాటక మాజీ సీఎం, జేడీఎస్ నాయకుడు హెచ్‌డీ కుమారస్వామిని కలిశారు. ఎన్డీయేలో చేరాలని జేడీఎస్ నిర్ణయించుకున్నందుకు సంతోషంగా ఉంది. ఎన్డీయేలోకి ఆయనను మనస్పూర్తిగా స్వాగతిస్తున్నాము’’ అని అన్నారు. పొత్తు కుదిరిందని, ఇప్పుడు సీట్ల పంపకంపై చర్చిస్తామని హెచ్‌డీ కుమారస్వామి చెప్పారు.

Women Reservation Bill: మహిళలకు రిజర్వ్ సీట్లు ఎలా ఎంపిక చేస్తారు, ఎవరు చేస్తారు? మొత్తం వివరాలు తెలుసుకోండి

ప్రస్తుతం కర్ణాటకలో కాంగ్రెస్ ప్రభుత్వం ఉంది. ఈ ఏడాది మేలో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ 135 సీట్లు గెలుచుకుంది. దీంతో బీజేపీ అధికారాన్ని కోల్పోవాల్సి వచ్చింది. బీజేపీ 66 సీట్లు, జేడీఎస్ 19 సీట్లు గెలుచుకున్నాయి. ఇలాంటి పరిస్థితుల్లో లోక్‌సభ ఎన్నికల దృష్ట్యా ఈ పొత్తు కీలకంగా పరిగణించబడుతుంది. 2019 లోక్‌సభ ఎన్నికల్లో కర్ణాటకలో బీజేపీ 25 సీట్లు గెలుచుకోగా, దాని మద్దతు ఇచ్చిన స్వతంత్ర (మాండ్యా నుంచి సుమలత అంబరీష్) ఒక సీటు గెలుచుకున్నారు. కాగా, కాంగ్రెస్, జేడీఎస్ ఒక్కో సీటు గెలుచుకున్నాయి. రాష్ట్రంలో మొత్తం 28 లోక్‌సభ స్థానాలు ఉన్నాయి.