CRPF బస్ పై ఉగ్రదాడి..12మంది జవాన్లు మృతి

CRPF బస్ పై ఉగ్రదాడి..12మంది జవాన్లు మృతి

Updated On : February 14, 2019 / 11:06 AM IST

కాశ్మీర్‌లో ఉగ్రవాదులు రెచ్చిపోయారు. శ్రీనగర్-జమ్మూ జాతీయ రహదారిపై పుల్వామా జిల్లాలోని అవంతిపురాలోని గోరిపోరా ఏరియాలో ఉగ్రవాదులు జరిపిన ఐఈడీ బ్లాస్ట్‌లో 12మంది సీఆర్పీఎఫ్ జవాన్లు ప్రాణాలు కోల్పోయారు. 15మంది జవాన్లు తీవ్రంగా గాయపడ్డారు. కాన్వాయ్‌లో భాగంగా ఉన్న సీఆర్పీఎఫ్ బస్ లక్ష్యంగా ఈ బ్లాస్ట్ జరిగింది. బస్సులో మొత్తం 35మంది జవాన్లు ఉన్నారు.

 

బ్లాస్ట్ జరిగిన తర్వాత మిలిటెంట్లు భద్రతా బలగాలపై కాల్పులకు తెగబడ్డారు. అవంతిపురాలోని సెక్యూరిటీ ఫోర్స్‌కి సహాయమందించేందుకు పెద్ద సంఖ్యలో బలగాలు అక్కడికి చేరుకున్నాయి. గాయపడిన జవాన్లను స్థానిక హాస్పిటల్‌కు తరలించారు. సీఆర్పీఎఫ్ ఐజీ ఘటనాస్థలికి చేరుకున్నారు. ఈ భయంకరమైన ఎటాక్ తమ పనేనంటూ ఉగ్రసంస్థ జైషే మహ్మద్ ప్రకటించుకుంది.