జార్ఖండ్ రాష్ట్రంలో జరుగుతున్న తొలివిడత అసెంబ్లీ ఎన్నికల పోలింగ్ ముగిసింది. 62.87 శాతం పోలింగ్ నమోదైంది. ఈ రోజు 13 అసెంబ్లీ స్థానాలకు ఈసీ తొలివిడుత పోలింగ్ నిర్వహించింది.
రాష్ట్రంలోని మొత్తం 81 అసెంబ్లీ స్థానాలకు గాను ఇవాళ 13 స్థానాలకు పోలింగ్ జరిగింది. ఐదు విడుతలుగా పోలింగ్ జరుగనుంది. ఐదు విడుతలుగా జరుగనున్న ఈ ఎన్నికలకు వేర్వేరు తేదీల్లో నోటిఫికేషన్, నామినేషన్ల స్వీకరణ, నామినేషన్ విత్‌డ్రా, పోలింగ్ తేదీలు ఉన్నాయి. ఎన్నికల ఫలితం డిసెంబర్-23,2019న వెల్లడికానుంది.