Kalpana Soren
Jharkhand Election Results 2024: జార్ఖండ్ అసెంబ్లీ ఎన్నిల ఫలితాల్లో జార్ఖండ్ ముక్తిమోర్చా (జేఎంఎం) నేతృత్వంలోని కూటమి సత్తా చాటుకుంది. జార్ఖండ్ రాష్ట్రంలో మొత్తం 81 అసెంబ్లీ స్థానాలకు ఎన్నికలు జరగ్గా.. జేఎంఎం కూటమి అభ్యర్థులు 56 స్థానాల్లో విజయం సాధించారు. ఎన్డీయే కూటమి అభ్యర్థులు 24 స్థానాల్లో విజయం సాధించగా.. ఇతరులు ఒక్క స్థానంలో విజయం సాధించారు. దీంతో మరోసారి ముఖ్యమంత్రి పీఠాన్ని హేమంత్ సోరెన్ అదిరోహించనున్నారు. ఇదిలాఉంటే.. జేఎంఎం కూటమి విజయంలో హేమంత్ సొరెన్ పాత్ర ఎంత కీలకమో.. అతని భార్య కల్పనా సోరెన్ కూడా అదే స్థాయిలో కీలక భూమిక పోషించారు.
Also Read: Pawan Kalyan : జై భవానీ.. జై శివాజీ.. జై మహారాష్ట్ర అంటూ మహారాష్ట్ర విజయంపై పవన్ కళ్యాణ్ ట్వీట్..
ఇంజనీరింగ్, బిజినెస్ అడ్మినిస్ట్రేషన్లో నేపథ్యం ఉన్న కల్పన సోరెన్.. 2024 మార్చి 4న జేఎంఎం వ్యవస్థాపక దినోత్సవ వేడుకల సందర్భంగా అధికారికంగా రాజకీయాల్లోకి అడుగుపెట్టారు. ఆమె భర్త హేమంత్ సొరెన్ ముఖ్యమంత్రి పదవికి రాజీనామా చేయడం, మనీలాండరింగ్ ఆరోపణలపై అరెస్టు చేయడం వంటి కీలకమైన సమయంలో ఆమె రాజకీయ రంగప్రవేశం చేశారు. అప్పటి నుంచి జేఎంఎం బలోపేతానికి కల్పన సోరెన్ తనదైన శైలిలో ముందుకు దూసుకెళ్లారు. గండేయ్ అసెంబ్లీ నియోజకవర్గానికి జరిగిన ఉప ఎన్నికలో గెలుపొంది తొలిసారి అసెంబ్లీలోకి అడుగుపెట్టారు. ముఖ్యంగా ఎన్నికల సమయంలో జేఎంఎం ఎన్నికల ప్రచారానికి కల్పన సొరెన్ నాయకత్వం వహించారు. తక్కువ వ్యవధిలోనే 200కుపైగా సభల్లో పాల్గొని తన పదునైన ప్రసంగాలతో ఓటర్లను జేఎంఎంకు ఆకర్షితులయ్యేలా చేశారు.
Also Read: మహారాష్ట్ర ఎన్నికల ఫలితాలపై కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి కీలక వ్యాఖ్యలు..
పార్లమెంట్ ఎన్నికల సమయంలోనూ రాష్ట్ర వ్యాప్తంగా పర్యటించి బీజేపీపై పదునైన విమర్శలు చేస్తూ ప్రజల్లోకి ఆమె చొచ్చుకుపోయారు. అనతి కాలంలోనే రాజకీయాల్లో తనదైన ముద్ర వేసుకునే ప్రయత్నం చేశారు. లోక్ సభ ఎన్నికల ప్రచారంలో ముమ్మరంగా పాల్గొన్నారు. అసెంబ్లీ ఎన్నికలకు షెడ్యూల్ ప్రకటించిన తరువాత హేమంత్ సొరెన్, కల్పన సొరెన్ కలిసి దాదాపు 200 సభల్లో పాల్గొనడం విశేషం. ఫలితంగా శనివారం వెల్లడైన ఫలితాల్లో జేఎంఎం కూటమి ఘన విజయం సాధించడంలో కల్పన సొరెన్ కీలక పాత్ర పోషించారు. తాజా అసెంబ్లీ ఎన్నికల్లో కల్పనా సోరెన్ గండేయ్ నియోజకవర్గం స్థానం నుంచి పోటీ చేయగా.. ఆమెకు 1,19,372 ఓట్లు పోలయ్యాయి. దీంతో తన సమీప బీజేపీ అభ్యర్థి మునియా దేవిపై 17,000 ఓట్ల తేడాతో గెలుపొందారు. ఈ క్రమంలో మరికొద్ది రోజుల్లో కొలువుదీరబోయే హేమంత్ సొరేన్ ప్రభుత్వంలో కల్పన సొరెన్ కు కీలక పదవి దక్కే అవకాశం అవకాశాలు లేకపోలేదు.
हमारे स्टार कैंपेनर का स्वागत है। pic.twitter.com/KmclcfIFlX
— Hemant Soren (@HemantSorenJMM) November 23, 2024