Woman Delivers Five Babies : ఒకే కాన్పులో ఐదుగురు ఆడబిడ్డలకు జన్మనిచ్చిన మహిళ

ఒక బిడ్డకు జన్మనివ్వటమే కష్టం. అటువంటిది ఝార్ఖండ్ లో ఓ మహిళ ఐదుగురు బిడ్డలకు జన్మనిచ్చింది.

Woman Delivers Five Babies : ఒకే కాన్పులో ఐదుగురు ఆడబిడ్డలకు జన్మనిచ్చిన మహిళ

Woman Delivers Five Babies

Updated On : May 23, 2023 / 12:38 PM IST

Ranchi RIMS Hospital : ఒక బిడ్డకు జన్మనివ్వటమే కష్టం. అటువంటిది ఝార్ఖండ్ లో ఓ మహిళ ఐదుగురు బిడ్డలకు జన్మనిచ్చింది. మహిళకు ప్రసవం పునర్జన్మలాంటిదంటారు. అటువంటి ఆ తల్లి ఐదుగురు బిడ్డలకు జన్మనిచ్చింది. ఝార్ఖండ్‌లోని రిమ్స్‌ ఆసుపత్రి (Rajendra Institute of Medical Sciences) లో ఐదుగురు బిడ్డలకు జన్మనిచ్చింది. ఐదుగురు ఆరోగ్యంగానే ఉండటం మరో విషయం.

కానీ శిశువులు తక్కువ బరువుతో పుట్టడంతో ఎన్‌ఐసీయూలో ఉంచి చికిత్స అందిస్తున్నారు డాక్టర్లు. తల్లీ బిడ్డలు క్షేమంగానే ఉన్నారని తెలిపాడు డాక్టర్లు. ఝార్ఖండ్‌ రాజధాని రాంచీ నగరంలోగల రిమ్స్ ఆసుపత్రిలో జరిగిన ఈ ఘటన గురించి డాక్టర్లు ట్వీట్టర్‌లో వెల్లడించారు. ‘‘ఛాటర్‌కు చెందిన ఓ మహిళ ఐదుగురు పిల్లలకు జన్మనిచ్చింది. శిశువులను ఎన్‌ఐసీయూలో ఉంచి పర్యవేక్షిస్తున్నాం’’ అని రిమ్స్ ట్వీట్ లో పేర్కొన్నారు.

ఛత్రా జిల్లాలోని ఇత్ఖోరీ లో నివసిస్తున్న మహిళకు అనేక ఇతర సమస్యలు ఉండటంతో గర్భం దాల్చలేదు. దీంతో ఆమె పలు చికిత్సలు తీసుకున్న తరువాత ఎట్టకేలకు గర్బం దాల్చింది. అలా ఒకరు ఇద్దరు కాదు ఐదుగురు బిడ్డలకు జన్మనిచ్చింది. ఆమెకున్న ఆరోగ్య సమస్యల వల్ల ఏడు నెలలకే ప్రసవం జరిగింది. ఆరోగ్య సమస్యలు ఉన్నా ఆమె ఐదుగురు ఆడపిల్లలు పుట్టటంతో డాక్టర్లు సైతం ఆశ్చర్యపోతున్నారు.