J&J Vaccine: సింగిల్ షాట్ వ్యాక్సిన్ ఫేజ్ 3ట్రయల్స్ పర్మిషన్‌ అడుగుతున్న జాన్సన్ అండ్ జాన్సన్

గ్లోబల్ క్లినికల్ ట్రయల్ డివిజన్ ను ఏప్రిల్ 12నే కన్సల్ట్ చేసి అప్లై చేసినట్లు జాన్సన్ అండ్ జాన్సన్ ..

J&J Vaccine: సింగిల్ షాట్ వ్యాక్సిన్ ఫేజ్ 3ట్రయల్స్ పర్మిషన్‌ అడుగుతున్న జాన్సన్ అండ్ జాన్సన్

Johnson And Johnson Vaccine

Updated On : April 20, 2021 / 3:16 PM IST

J&J Covid vaccine: మల్టీ నేషనల్ ఫార్మా దిగ్గజం జాన్సన్ అండ్ జాన్సన్ ఫేజ్ 3ట్రయల్స్ పూర్తి చేసేందుకు అనుమతులు అడుగుతుంది. ఇండియాలో కొవిడ్ 19 సింగిల్ షాట్ వ్యాక్సిన్ రెడీ చేయాలని ప్లాన్ చేస్తుంది. ఈ మేరకు లైసెన్స్ కావాలని ఇండియా డ్రగ్ రెగ్యూలేటర్ ను అనుమతి అడిగింది.

ఇదే సబ్జెక్టుపై సెంట్రల్ డ్రగ్స్ స్టాండర్ట్ కంట్రోల్ ఆర్గనైజేషన్ కమిటీతో మీటింగ్ అవ్వాలని ప్లాన్ చేసింది. అన్ని విదేశీ కరోనావైరస్ ప్రయోగాలకు ఫాస్ట్ ట్రాక్ ఎమర్జెన్సీ అప్రూవల్స్ ఇవ్వాలని కేంద్ర ప్రభుత్వం నిర్ణయించింది. ఈ క్రమంలో వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్, యూనైటెడ్ స్టేట్స్, యూరప్, బ్రిటన్, జపాన్ లలో కొవిడ్ కేసులు పెరిగి వ్యాక్సిన్ కొరత ఏర్పడటంతో ఈ నిర్ణయం తీసుకుంది.

అటువంటి వ్యాక్సిన్లకు ఎమర్జెన్సీ యూజ్ అప్రూవల్ తప్పనిసరి చేసింది. న్యూ డ్రగ్స్ అండ్ క్లినికల్ ట్రయల్స్ రూల్స్ 2019 ప్రకారం.. అనుమతులు ఇవ్వనున్నారు.

ఈ మేరకు సుగమ్ ఆన్ లైన్ పోర్టల్ లో గ్లోబల్ క్లినికల్ ట్రయల్ డివిజన్ ను ఏప్రిల్ 12నే కన్సల్ట్ చేసి అప్లై చేసినట్లు జాన్సన్ అండ్ జాన్సన్ పేర్కొంది. కొన్ని కారణాల రీత్యా ఆ అప్లికేషన్ ను మళ్లీ అంటే సోమవారం సబ్ మిట్ చేశాం.

ఇతర వ్యాక్సన్లలా కాకుండా జాన్సన్ అండ్ జాన్సన్ వ్యాక్సిన్ ఒక్క డోస్ ఇస్తే సరిపోయేలా రెడీ చేస్తున్నారు. పైగా దీనిని 2 నుంచి 8డిగ్రీల సెల్సియస్ మధ్యలో మూడు నెలల వరకూ స్టోర్ చేయొచ్చు. ఇప్పటి వరకూ ఆక్స్ ఫర్డ్/ఆస్ట్రాజెనెకా వ్యాక్సిన్, కొవాక్సిన్ లు ఇండియాలో అనుమతి పొందాయి. అంతేకాకుండా రష్యాకు చెందిన స్పుత్నిక్ వీ కూడా ఇండియన్ డ్రగ్ రెగ్యూలేటర్ దగ్గర అప్రూవల్ అందుకుంది.