జమ్మూకాశ్మీర్‌లో పేలుడు : సీఆర్పీఎఫ్ వాహనం ధ్వంసం

జమ్మూకాశ్మీర్ లో పేలుడు కలకలం చెలరేగింది. జమ్మూ-శ్రీనగర్ హైవేపై వెళ్తున్న కారు పేలిపోయింది. సీఆర్పీఎఫ్ వాహనం వెళ్తున్న సమయంలో ఈ పేలుడు జరిగింది. పేలుడు ధాటికి

  • Publish Date - March 30, 2019 / 07:04 AM IST

జమ్మూకాశ్మీర్ లో పేలుడు కలకలం చెలరేగింది. జమ్మూ-శ్రీనగర్ హైవేపై వెళ్తున్న కారు పేలిపోయింది. సీఆర్పీఎఫ్ వాహనం వెళ్తున్న సమయంలో ఈ పేలుడు జరిగింది. పేలుడు ధాటికి

జమ్మూకాశ్మీర్ లో పేలుడు కలకలం చెలరేగింది. జమ్మూ-శ్రీనగర్ హైవేపై వెళ్తున్న కారు పేలిపోయింది. సీఆర్పీఎఫ్ వాహనం వెళ్తున్న సమయంలో ఈ పేలుడు జరిగింది. పేలుడు ధాటికి సీఆర్పీఎఫ్ వాహనం స్వల్పంగా  ధ్వంసమైంది. ఎలాంటి ప్రాణనష్టం జరగలేదు. కారు డ్రైవర్ సురక్షితంగా బయటపడ్డాడు. ఈ ఘటనతో హైవేపై కాసేపు రాకపోకలు నిలిచిపోయాయి. కారులో గ్యాస్ సిలిండర్ పేలడం వల్లే ఈ ఘటన జరిగిందని  చెబుతున్నారు. సాంత్రో కారు పూర్తిగా కాలిపోయింది.
Read Also : పెద్దాయన లేకుండానే : అమిత్ షా నామినేషన్

శనివారం(మార్చి 30, 2019) రాంబన్స్ బనిహాల్ ప్రాంతంలో ఈ ఘటన జరిగింది. సైనికుల క్వానాయ్ కు సమీపంలో జరగడంతో అంతా ఆందోళన చెందారు. దాడి జరిగిందేమో అని కంగారు పడ్డారు. ఇది దాడి కాదని  ప్రమాదం అని పోలీసులు తేల్చారు.

ఫిబ్రవరి 14న పుల్వామాలో జరిగిన ఉగ్రదాడిలో 40మంది సైనికులు అమరులైన సంగతి తెలిసిందే. సీఆర్పీఎఫ్ కాన్వాయ్ లక్ష్యంగా ఆత్మాహుతి దాడి జరిగింది. ఓ వాహనంలో పేలుడు పదార్దాలు నింపుకుని జవాన్ల కాన్వాయ్ పై దాడి చేశారు. ఈ ఘటన యావత్ దేశాన్ని కదిలించింది. ఆ తర్వాత భద్రతను కట్టుదిట్టం చేశారు.

Read Also : ఒకే గదిలో నీరవ్ మోడీ, విజయ్ మాల్యా