Anti-Brahmin: జేఎన్‭యూలో బ్రాహ్మణ వ్యతిరేక నినాదాలు.. విచారణకు ఆదేశించిన యూనివర్సిటీ వీసీ

స్కూల్ ఆఫ్ ఇంటర్నేషనల్ స్టడీస్ డీన్ నేతృత్వంలోని గ్రీవెన్స్ కమిటీ విచారణ జరిపి వీలైనంత త్వరగా వీసీకి నివేదిక సమర్పించాలని కోరారు" అని ప్రకటనలో యాజమాన్యం పేర్కొంది. బ్రాహ్మణ, బనియా వర్గాలకు వ్యతిరేకంగా నినాదాలు చేస్తూ స్కూల్ ఆఫ్ ఇంటర్నేషనల్ స్టడీస్ II భవనంలోని గోడలను ధ్వంసం చేశారని విద్యార్థులు పేర్కొన్నారు

Anti-Brahmin: జవహర్‌లాల్ నెహ్రూ విశ్వవిద్యాలయంలోని క్యాంపస్ గోడలపై బ్రాహ్మణ వ్యతిరేక నినాదాలు కనిపించడంపై ఆ యూనివర్సిటీ వైస్-ఛాన్సలర్ గురువారం నివేదిక కోరారు. దీనిపై ఫిర్యాదుల కమిటీ విచారణ చేపట్టి తనకు తుది నివేదిక సమర్పించాలని ఆదేశించారు. గోడలపై రాసిన నినాదాలను కొంత మంది ఫొటోలు తీసి సోషల్ మీడియాలో షేర్ చేశారని, ఆ వివరాలను సైతం సేకరించాలని వీసీ ఆదేశించారు.

Gujarat Polls: మోదీ నిర్వహించిన అతి పెద్ద రోడ్‭-షోలో ఎన్ని లక్షల మంది పాల్గొన్నారో తెలుసా?

“స్కూల్ ఆఫ్ ఇంటర్నేషనల్ స్టడీస్, జవహార్‭లాల్ విశ్వవిద్యాలయంలోని క్యాంపస్ గోడలపై బ్రాహ్మణ, బనియాలకు వ్యతిరేకంగా నినాదాలను రాశారు. అలాగే అధ్యాపకుల గదులను ధ్వంసం చేశారు. ఈ రెండు సంఘటనను వైస్-ఛాన్సలర్ తీవ్రంగా పరిగణించారు. క్యాంపస్‌లో ఈ ప్రత్యేక ధోరణిని యూనివర్సిటీ పరిపాలన విభాగం ఖండిస్తోంది. జేఎన్‭యూ అందరికీ చెందినది, కాబట్టి ఇలాంటి ఘటనలను ఎంత మాత్రం సహించదు” అని యూనివర్సిటీ ఒక ప్రకటనలో తెలిపింది.

Congress U-Turn: మల్లికార్జున ఖర్గే విషయంలో మాట తప్పిన కాంగ్రెస్.. ఉదయ్‭పూర్ తీర్మానంపై యూటర్న్

“స్కూల్ ఆఫ్ ఇంటర్నేషనల్ స్టడీస్ డీన్ నేతృత్వంలోని గ్రీవెన్స్ కమిటీ విచారణ జరిపి వీలైనంత త్వరగా వీసీకి నివేదిక సమర్పించాలని కోరారు” అని ప్రకటనలో యాజమాన్యం పేర్కొంది. బ్రాహ్మణ, బనియా వర్గాలకు వ్యతిరేకంగా నినాదాలు చేస్తూ స్కూల్ ఆఫ్ ఇంటర్నేషనల్ స్టడీస్ II భవనంలోని గోడలను ధ్వంసం చేశారని విద్యార్థులు పేర్కొన్నారు. “బ్రాహ్మణులు క్యాంపస్‌ను విడిచిపెట్టండి”, “మా రక్తం ఉంటుంది”, “బ్రాహ్మణులు భారత్‭ను వదిలి పెట్టండి”, “బ్రాహ్మిన్-బనియాలానా, మేము మీ కోసం వస్తున్నాము! మీమీద ప్రతీకారం తీర్చుకుంటాము” అని క్యాంపస్ గోడలపై రాసినట్లు తెలుస్తోంది.

Elon Musk: ట్విట్టర్ అకౌంట్ చెక్ చేసుకున్నారా? ఫాలోవర్లు తగ్గుతారన్న మస్క్.. కారణం ఏంటంటే?

ట్రెండింగ్ వార్తలు