Elon Musk: ట్విట్టర్ అకౌంట్ చెక్ చేసుకున్నారా? ఫాలోవర్లు తగ్గుతారన్న మస్క్.. కారణం ఏంటంటే?

2022 ద్వితియార్థంలో ట్విట్టర్‭లో దాదాపు 238 మిలియన్ ఖాతాలు ఉన్నాయి. అయితే ఖచ్చితమైన సంఖ్యను పంచుకోకుండానే కంపెనీ భారీ వృద్ధిని సాధిస్తోందని మస్క్ పేర్కొనడం గమనార్హం. ప్లాట్‌ఫాంలోని స్పామ్ ప్రొఫైల్‌ లక్షణాలు, గుర్తింపు, తొలగింపుకు సంబంధించిన ఎలాంటి సమాచారాన్ని మస్క్ వెల్లడించలేదు. స్పామ్ ప్రొఫైల్ సమస్య ట్విట్టర్‌కు అంత పెద్ద నష్టమేమీ కాదు

Elon Musk: ట్విట్టర్ అకౌంట్ చెక్ చేసుకున్నారా? ఫాలోవర్లు తగ్గుతారన్న మస్క్.. కారణం ఏంటంటే?

Elon Musk says Twitter users will witness drop in followers

Elon Musk: ట్విట్టర్‭లో ఫాలోవర్లు తగ్గనున్నారట. ఈ విషయాన్ని ట్విట్టర్ అధినేత ఎలాన్ మస్క్ స్వయంగా వెల్లడించారు. ఫాలోవర్లు తగ్గే పని ప్రారంభమైందట, ఎవరెవరి ఖాతాలో ఎంత ఫాలోవర్లైనా, ఎప్పుడైనా తగ్గొచ్చని ఆయన అంటున్నారు. ట్విట్టర్ ఆఫీసు నుంచి ఇప్పటికే చాలా మందిని బయటికి పంపిన మస్క్.. ఇప్పుడు ఫాలోవర్లను కూడా పంపిస్తున్నారా అని అనుకుంటున్నారా? ఇదీ ఒక రకంగా నిజమే. కాకపోతే ట్విట్టర్‭లో ఉన్న ఫేక్ ఖాతాలను తొలగించే పనిలో మస్క్ టీం బిజీగా ఉంది. ఈ పని పూర్తవుతూ ఉంటే, ఖాతాల తొలగింపు వల్ల ఫాలోవర్లు తగ్గుతారని మస్క్ స్పష్టం చేశారు.

Renew Netflix Subscription : ఆన్‌లైన్ మోసాలతో జాగ్రత్త.. నెట్‌ఫ్లిక్స్ అకౌంట్ రెన్యువల్ చేస్తామంటూ లక్ష కొట్టేసిన మోసగాళ్లు..!

ప్లాట్‌ఫాంలో స్పామ్/స్కామ్ ఖాతాలను ట్విట్టర్ ప్రక్షాళన చేస్తోందని ఎలాన్ మస్క్ ట్వీట్ చేశారు. వాస్తవానికి ఈ ఖాతాల గురించి ట్విట్టర్ కొనుగోలుకు ముందే మస్క్ ప్రస్తావించారు. తనకు స్పామ్ ఖాతాల జాబితా కావాలని అప్పటి యాజమాన్యాన్ని కోరారు. స్పామ్ ఖాతాల గురించి అప్పటి సీఈవో పరాగ్ అగర్వాల్ తనకు అబద్ధం చెప్పారని మస్క్ మండిపడ్డారు కూడా. ట్విట్టర్‭లో స్పామ్ ఖాతాలు యూజర్‌బేస్‌లో దాదాపు 5 శాతం ఉన్నాయని, వీటిని కొనుగోలు చేయబోమని మస్క్ అన్నారు. కొంతమంది నిపుణులు కూడా ట్విట్టర్ స్పామ్ ఖాతాలు ఎక్కువగా ఉన్నాయని సూచిస్తున్నారు. వారి అంచనా ప్రకారం మొత్తం యూజర్ బేస్‌లో 17 శాతం ఉండవచ్చని అంటున్నారు. ఎట్టకేలకు స్పామ్/స్కామ్ ఖాతాల ఏరి వేతను ట్విట్టర్ చేపట్టింది.

Congress U-Turn: మల్లికార్జున ఖర్గే విషయంలో మాట తప్పిన కాంగ్రెస్.. ఉదయ్‭పూర్ తీర్మానంపై యూటర్న్

2022 ద్వితియార్థంలో ట్విట్టర్‭లో దాదాపు 238 మిలియన్ ఖాతాలు ఉన్నాయి. అయితే ఖచ్చితమైన సంఖ్యను పంచుకోకుండానే కంపెనీ భారీ వృద్ధిని సాధిస్తోందని మస్క్ పేర్కొనడం గమనార్హం. ప్లాట్‌ఫాంలోని స్పామ్ ప్రొఫైల్‌ లక్షణాలు, గుర్తింపు, తొలగింపుకు సంబంధించిన ఎలాంటి సమాచారాన్ని మస్క్ వెల్లడించలేదు. స్పామ్ ప్రొఫైల్ సమస్య ట్విట్టర్‌కు అంత పెద్ద నష్టమేమీ కాదు. కానీ ఇన్‭స్టాగ్రామ్, ఫేస్‭బుక్ వంటి ఇతర ప్లాట్‌ఫాంలను బాగా ప్రభావితం చేస్తుంది. స్పామ్ ఖాతాల సస్పెన్షన్ కారణంగా సెలబ్రిటీలు సహా వెరిఫైడ్ అకౌంట్ ఉన్న వారు తమ ఫాలోవర్ల సంఖ్య అకస్మాత్తుగా తగ్గుతోందని ఫిర్యాదులు చేస్తున్నారు.

WhatsApp New Feature : వాట్సాప్‌లో కొత్త ఫీచర్.. ఇకపై చాట్‌లో మెసేజ్‌లను తేదీల వారీగా సెర్చ్ చేసుకోవచ్చు.. ఇప్పుడే చెక్ చేసుకోండి..!