Bank Of Baroda : బ్యాంక్ ఆఫ్ బరోడాలో ఉద్యోగాల భర్తీ

అభ్యర్ధులు తమ దరఖాస్తులను ఆన్ లైన్ లో పంపాల్సి ఉంటుంది. అభ్యర్ధులను రాతపరీక్ష అధారంగా ఎంపిక చేస్తారు.

Jobs

Bank Of Baroda : బ్యాంక్‌ ఆఫ్‌ బరోడా పలు పోస్టుల భర్తీకి నోటిఫికేషన్‌ జారీ చేసింది. నోటిఫికేషన్‌లో భాగంగా పలు విభాగాల్లో 10 ఖాళీలను భర్తీ చేయనున్నారు. భర్తీ చేయనున్న ఉద్యోగాల్లో ఆఫీస్ అసిస్టెంట్, బిజినెస్ కరస్పాండెంట్, సూపర్ వైజర్, సీనియర్ మేనేజర్, ఫ్యాకల్టీ, అసిస్టెంట్ వైస్ ప్రెసిడెంట్, ఇంటర్నల్ అంబుడ్స్‌మన్, ప్రొడక్ట్ హెడ్ వంటి పోస్టులు ఉన్నాయి.

ప్రొడక్ట్ హెడ్ విభాగానికి దరఖాస్తు చేసుకునే వారు డిగ్రీ ఉత్తీర్ణులై ఉండాలి. మేనేజ్‌మెంట్‌ కోర్సుల్లో ఫుల్ టైమ్ డిగ్రీ, డిప్లొమా చేసిన అభ్యర్థులకు అవకాశం కల్పిస్తారు. అసిస్టెంట్ వైస్ ప్రెసిడెంట్, సీనియర్ మేనేజర్, మేనేజర్ తదితర ఖాళీలకు డిగ్రీ పూర్తి చేసిన వారు అర్హులు. బీఈ, బీటెక్, ఎంసీఏ చేసిన వారికి ప్రాధాన్యం కల్పిస్తారు.

అభ్యర్ధులు తమ దరఖాస్తులను ఆన్ లైన్ లో పంపాల్సి ఉంటుంది. అభ్యర్ధులను రాతపరీక్ష అధారంగా ఎంపిక చేస్తారు. దరఖాస్తుల స్వీకరణకు మార్చి 7,, 2022 చివరి తేదిగా నిర్ణయించారు. పూర్తి వివరాలకు https://www.bankofbaroda.in/ సంప్రదించగలరు.