Nitika Kaul: ఇదే నా భర్తకు అసలైన నివాళి: ఆర్మీలో చేరిన పుల్వామా అమరుడు భార్య నితికా కౌల్..

Indian Army Lf Nithika Koul (1)

Indian Army Lt.  Nitika Kaul: ఇండియన్ ఆర్మీ. ఈ మాట వింటేనే ప్రతీ భారతీయుడు రోమాలు నిక్కబొడుకుంటాయి. ఇండియన్ ఆర్మీ పౌరుషానికి..తెగువకు, దేశభక్తికి నిలువెత్తు నిదర్శనం. దేశ సేవలో ఎంతోమంది అమరులవుతున్నారు. కానీ..వారి కుటుంబాలు మాత్రం ఏదో సాధారణ పౌరుల్లా ఏమాత్రం ఆలోచించరు. దేశ కోసం ప్రాణాలు అర్పించినవారి కుటుంబ సభ్యుల ధీరత్వం గురించి ఎంత చెప్పినా తక్కువే. దేశ కోసం ప్రాణాలు అర్పించిన ఓ దేశ భక్తుడి తల్లిదండ్రులు ‘మా కొడుకు దేశం కోసం చనిపోయాడు..అది మాకు గర్వకారణం..ఓ కొడుకు చనిపోయినా మరో కొడుకుని దేశం కోసం ఇస్తాం’అంటారు. అదీ భారతీయుల గొప్పదనం. అదే ప్రాణాలు కోల్పోయిన సైనికుడు భార్య కూడా ‘నా భర్త కోసం ప్రాణాలు అర్పించారు..అది నాకు గొప్పదనం..గర్వంతో నా హృదయం ఉప్పొంగుతోందంటారు. నా భర్త స్థానంలో నేను దేశం కోసం పోరాడుతాను..నా ప్రాణాలు నా దేశం కోసమే’ అని అంటారు. అది భారతదేశపు ధీరవనిత దేశ భక్తి.

ఇటువంటి ధీర వనితలకు భారతదేశం పుట్టినిల్లు అని చెప్పే ఎన్నో గొప్ప గొప్ప ఘటనలు ఉన్నాయి. అటువంటి మరో ధీర వనితే ‘నితికా కౌల్’. పుల్వామా ఉగ్రదాడిలో అమరుడు మేజర్ విభూతి శంకర్ దౌండియాల్ జీవన సహచరి ‘నితికా కౌల్’. తన భర్త ఉగ్రమూకల చేతిలో ప్రాణాలు అర్పించినా..దేశం కోసం నేనున్నానంటూ ఆర్మీలో చేరారు నితికా కౌల్. నా భర్త ప్రాణాలు కోల్పోయినా అది నా గుండెల్లో నేను బ్రతికి ఉన్నంత కాలం ఆ బాధ..వేదన గూడు కట్టుకునే ఉంటుంది. అలా బాధపడుతూ కూర్చోవటం భారతీయ స్త్రీ లక్షణం కాదు..నా భర్త లేకపోయినా దేశం కోసం సేవ చేయటానికి నేనున్నానంటూ ఇండియన్ ఆర్మీలో చేరారు నితికా కౌల్. అదే నా భర్తను నేనిచ్చే అసలైన నివాళి అంటున్న వీర వనిత నితికా కౌల్.

జమ్మూకశ్మీర్‌లో 2019లో జరిగిన ఉగ్రదాడిలో అమరుడుడైన మేజర్ విభూతి శంకర్ దౌండియాల్ సతీమణి నితికా కౌల్ శనివారం ఇండియన్ ఆర్మీలో చేరి లెఫ్టినెంట్‌గా బాధ్యతలు చేపట్టారు. సౌత్ కమాండ్ చీఫ్ లెఫ్టినెంట్ జనరల్ వైకే జోషి స్వయంగా ఆమె భుజాలపై స్టార్స్ పెట్టి సైన్యంలోకి ఆహ్వానించారు. భర్త వీరమణం పొందిన కొన్ని నెలలకే ఆర్మీలో చేరాలని నిర్ణయించుకున్నారు నితికా.

దీని కోసం షార్ట్ సర్వీస్ కమిషన్ ఎగ్జామినేషన్‌‌లో, ఇంటర్వ్యూలో కూడా చక్కటి ప్రతిభ కనబరిచారు. మే 26న నితికా చెన్నైలోని ఆఫీసర్ ట్రైనింగ్ అకాడమీ నుంచి ఉత్తీర్ణత సాధించారు. గత శనివారం (మే 29,2021)అధికారికంగా ఇండియాన్ ఆర్మీలో చేరారు.

ఈ సందర్భంగా నితికా మాట్లాడుతూ..‘ఇండియన్ ఆర్మీలో చేరి దేశానికి సేవలందించటమే నా భర్త మేజర్ విభూతి శంకర్ దౌండియల్ నేనిచ్చే అసలైన నివాళిగా భావిస్తున్నానని తెలిపారు. నా ఈ ప్రయాణంలో నా భర్త నాతోనే ఉన్నారనే సంతృప్తితో నా మనస్సు నిండిపోయింది. నా భర్త ప్రాణాలతో లేరని నేను అనుకోవటంలేదు. భారత ఆర్మీ దుస్తులు నా ఒంటిపై ధరించటం నా అదృష్టంగా భావిస్తున్నాను..నా భర్త నాతోనే ఉన్నారు..అనే భావనతోనే నా విధులు నిర్వహిస్తాను..నా దేశం కోసం నా శక్తి వంచన లేకుండ కృషి చేస్తానని భావోద్వేగంతో తెలిపారు.

2019 ఫిబ్రవరి 14న పుల్వామాలో సీఆర్‌పీఎఫ్ కాన్వాయ్‌పై జరిగిన ఉగ్రవాద దాడిలో 40 మంది సైనికులు అమరవీరులయ్యారు. ఈ ఘటన అనంతం పుల్వామాలోని పింగ్లాన్ గ్రామంలో ఉగ్రవాదులను పట్టుకునేందుకు భారత ఆర్మీ ఆపరేషన్ చేసింది.ఈ అమరవీరులలో మేజర్ ర్యాంక్ ఆఫీసర్ విభూతి శంకర్ దౌండియల్ కూడా ఉన్నారు. మేజర్ దౌండియల్ భౌతికకాయం స్వగ్రామానికి చేరుకున్నప్పుడు ఆయన భార్య నితికా కౌల్.. తన భర్త దేశం కోసం ప్రాణాలు అర్పించటం గర్వపడుతున్నానని తెలిపారు. భర్త భౌతికకాయానికి సెల్యూట్ చేశారు. ఉగ్రదాడిలో మేజర్ దౌండియల్ ప్రాణాలు కోల్పోయేనాటికి దౌండియల్, నితికాల వివాహం జరిగి కనీసం సంవత్సరం కూడా పూర్తి కాలేదు. మొదటి వివాహం దినోత్సం చేసుకోకుండానే భర్తకు కోల్పోయారు నితికా. అయినా ఆమె ఏమాత్రంకృంగిపోలేదు. గుండెల్లో కొండంత బాధతోనే భర్త భౌతికకాయానికి సెల్యూట్ చేసిన ధీర వనిత వితికా కౌల్. జీవన సహచరి అనే పదానికి అసలైన అర్థం చెపుతూ..ఆర్మీలో చేరారు నితికాకౌల్.