Justice NV Ramana Farewell Meeting
Justice NV Ramana Farewell Meeting : ఎన్నో కష్టాలు పడి తాను పైకి వచ్చానని జస్టిస్ ఎన్వీ రమణ అన్నారు. తాను గొప్ప జడ్జిని కాకపోవచ్చు కానీ సామాన్యుడికి న్యాయం అందేలా కృషి చేశానని తెలిపారు. సుప్రీంకోర్టులో జరిగిన వీడ్కోలు సభలో జస్టిస్ ఎన్వీ రమణ ఈ వ్యాఖ్యలు చేశారు. తన వృత్తి జీవితంలో ఎన్నో సవాళ్ళను ఎదుర్కొన్నానని తెలిపారు. ప్రజాస్వామ్యంలో ప్రతి ఒక్కరికీ న్యాయం జరగాలని రమణ వెల్లడించారు. న్యాయస్థానంలో న్యాయం జరుగుతుందన్న నమ్మకాన్ని ప్రజల్లో కలిగించాలని.. న్యాయవాదులు తమ వృత్తి ధర్మాన్ని పాటించాలని సూచించారు.
న్యాయవాదులకు ఎన్నో ఇబ్బందులు ఎదురవుతాయి.. కానీ మీరు యోధులని నిరూపించే రోజొకటి వస్తుందన్నారు. కనీస వసతులు లేని గ్రామం నుంచి నా ప్రస్థానం ప్రారంభమైందన్నారు. ఈ వృత్తిలో అనేక ఒడిదుడుకులు ఉంటాయని న్యాయవాదులు గుర్తించాలన్నారు. న్యాయమూర్తిగా చెప్పుకోవడానికి తాను ఎప్పుడూ ప్రయత్నించలేదు..కానీ సామాన్యుడికి న్యాయం జరుగుతుందా లేదా అని చూశానను అని అన్నారు. తనకు విద్య నేర్పిన గురువులు, స్ఫూర్తినిచ్చినవారికి రుణపడి ఉంటానని చెప్పారు.
CJI Justice NV Ramana : శాసన వ్యవస్థపై సీజేఐ జస్టిస్ ఎన్వీ రమణ సంచలన వ్యాఖ్యలు
న్యాయవాద వృత్తి కత్తిమీద సాములాంటిదన్నారు. క్రికెట్‌లో ప్రతీ బాల్ సిక్స్ కొట్టాలని ప్రేక్షకులు కోరుకుంటారు..కానీ ఏ బాల్‌ను సిక్స్ కొట్టగలడో బ్యాట్స్‌మెన్‌కు మాత్రమే తెలుస్తుందన్నారు. ప్రజాస్వామ్య విలువ పెంచడానికి న్యాయవాదులు కృషి చేయాలని సూచించారు. న్యాయ వ్యవస్థపై ప్రజల్లో నమ్మకం పెరిగేలా చేశానని పేర్కొన్నారు. తాను ఏదైనా సాధించగలిగానంటే…దాని వెనకాల ఎంతో పోరాటం ఉంది… అదే జీవితంలో కష్టాలను దూరం చేసిందన్నారు.
తాను అన్ని సవాళ్లను అధిగమించాను..వాటంత అవే తన దారికి వచ్చాయన్నారు. తనను తాను బలోపేతం చేసుకున్నాను..అర్థం చేసుకున్నానని తెలిపారు. ప్రతి అపజయాన్ని ఛాలెంజ్‌గా తీసుకున్నానని చెప్పారు. తనను తాను గొప్ప జడ్జిగా భావించనని అన్నారు. న్యాయవ్యవస్థ సాధారణ పౌరుడి వద్దకు చేరాలని నమ్ముతానని పేర్కొన్నారు. జస్టిస్ ఎన్వీ రమణ సేవలను న్యాయమూర్తులు కొనియాడారు.