Tamilnadu
K.T Raghavan : తమిళనాడు బీజేపీలో ఓ వీడియో కాల్ దుమారం రేగుతోంది. ఈ పార్టీ ప్రధాన కార్యదర్శిగా ఉన్న కె.టి.రాఘవన్..పార్టీ మహిళా కార్యకర్తతో అసభ్యంగా మాట్లాడినట్లు ఆరోపణలు వినిపిస్తున్నాయి. దీనికి సంబంధిచిన వీడియో ఇప్పుడు వైరల్ గా మారింది. రాజకీయాల్లో ఈ వీడియో…సంచలనంగా మారింది. దీనిపై తీవ్ర విమర్శలు చేసిన కాంగ్రెస్…డీజీపీకి ఫిర్యాదు చేశారు. దీంతో ప్రధాన కార్యదర్శి పదవికి రాఘవన్ రాజీనామా చేశారు. దీనిపై ఆయన స్పందించారు. రాజకీయంగా ఇబ్బందులు పెట్టాలని, తప్పుడు వీడియోలు వైరల్ చేశారని అంటున్నారు. దీనిపై న్యాయపోరాటం చేస్తానని స్పష్టం చేస్తున్నారు.
Read More : Gold : స్వల్పంగా పెరిగిన బంగారం..నేటి మార్కెట్ రేట్లు
తమిళనాడు రాష్ట్రంలో బీజేపీ పార్టీకి ప్రధాన కార్యదర్శిగా రాఘవన్ వ్యవహరిస్తున్నారు. ఓ మహిళతో అసభ్యకరంగా మాట్లాడినట్లు వివాదంలో ఈయన చిక్కుకున్నారు. కొంతమంది వ్యక్తులు ఈ వీడియోను వైరల్ చేశారు. దీంతో బీజేపీ అధిష్టానం ఆయన్ను ప్రశ్నించినట్లు సమాచారం. వీడియోలో రాఘవన్ అర్ధనగ్నంగా ఉన్నారు. మహిళతో కాల్ చేసినట్లు కనిపిస్తోంది. ఆయనపై చర్యలు తీసుకోవాలని కాంగ్రెస్ ఎంపీ జ్యోతిమణి రాష్ట్ర డీజీపీకి ఫిర్యాదు చేశారు. ఆయనపై చర్యలు తీసుకోవాలని కోరారు. ప్రస్తుతం ఈ వీడియో రాష్ట్రంలో సంచలనంగా మారడమే కాకుండా..వైరల్ గా మారింది. ఈ వ్యవహరంపై ప్రస్తుతం విచారణ కొనసాగుతోంది.