'kacha Badam' Singer Bhuban Badyakar Meets With A Car Accident; Rushed To The Hospital
Kacha Badham Singer : ఓవర్ నైట్ స్టార్.. సోషల్ మీడియా సెన్సేషన్ అయిన ‘కచ్చా బాదమ్’ సింగర్ భుబన్ బద్యాకర్ ప్రమాదానికి గురయ్యాడు. ఈ ఘటన పశ్చిమ బెంగాల్ లోని బీర్భూమ్‌లో సోమవారం చోటుచేసుకుంది. కచ్చా బాదమ్ సాంగ్‌తో పాపులర్ అయిన బద్యాకర్.. ఇటీవలే సెకండ్ హ్యాండ్ కారును కొన్నాడు. ఆ కారులో డ్రైవింగ్ నేర్చుకుంటున్న సమయంలో ఈ ప్రమాదం జరిగింది. ప్రమాదంలో బద్యాకర్ చాతికి స్వల్ప గాయాలు అయినట్టు వైద్యులు వెల్లడించారు. ప్రస్తుతం బద్యాకర్ ఓ సూపర్ స్పెషాలిటీ ఆస్పత్రిలో చికిత్స తీసుకుంటున్నాడు. ప్రస్తుతం అతడి ఆరోగ్య పరిస్థితి నిలకడగానే ఉందని వైద్యులు వెల్లడించారు. ఇప్పుడు ఎక్కడా చూసినా.. ‘కచ్చా బాదమ్’ పాటనే ఎక్కువగా వినిపిస్తోంది.
అంత ట్రెండింగ్ క్రియేట్ చేశాడు తన పాటతో బద్యాకర్.. ఈ ఒక్క పాటతో రాత్రికిరాత్రే స్టార్ డమ్ తెచ్చుకున్న బద్యాకర్.. పాత వస్తువులను తీసుకుని పల్లీలను విక్రయిస్తుండేవాడు. తాను క్రియేట్ చేసిన ‘కచ్చా బాదమ్’ పాట సోషల్ మీడియాలో వైరల్ కావడంతో సెన్సేషన్ స్టార్ అయిపోయాడు. బైకుపై పచ్చి పల్లీల మూట వేసుకుని కచ్చా బాదమ్ అంటూ పాట పాడుతూ ఊరూరా తిరిగేవాడు. పాడైన సెల్ ఫోన్లు, ఇతర వస్తువులకు పల్లీలను విక్రయించేవాడు. రోజుకు రూ.200 నుంచి రూ.250 వరకు సంపాదించేవాడు.
ఈ క్రమంలో తన పాటతో కొనుగోలుదారులను ఆకర్షించేందుకు కచ్చా బాదమ్ (బెంగాల్ లో పచ్చి పల్లీలు అని అర్థం) అంటూ తాను రోజు అనే పదాలను పాటగా మలిచాడు. ఆ పాటకు ట్యూన్ కట్టి వీధి వీధిన తిరుగుతూ పాడేవాడు. అలా తన పాటను విన్న ఓ యూట్యూబర్ వీడియో రికార్డు చేసి యూట్యూబ్ లో పెట్టాడు. అంతే.. ఆ పాటకు ఎక్కడలేని రెస్పాన్స్ వచ్చేసింది.
Kacha Badham Singer : బద్యాకర్‌కు రూ. 3 లక్షల రెమ్యునరేషన్ :
బాలీవుడ్ కొరియోగ్రాఫర్ల నుంచి పలువురు సెలబ్రిటీలు అతడి పాటకు డీజే రిమేక్ చేస్తూ సోషల్ మీడియాలో వైరల్ చేశారు. కచ్చా బాదమ్ పాటకు అదిరే స్టెప్పులు వస్తూ సోషల్ మీడియాలో పోస్టులు పెట్టారు. అంతే.. బద్యాకర్ ను సంప్రదించి ఆయనతో పలు ఆల్బమ్ వీడియోల్లో రీమేక్ చేయించారు. పలు షోల్లో బద్యాకర్ తో పాడించారు.
బద్యాకర్ పాడిన కచ్చా బాదమ్ సాంగ్ రైట్స్ కొనుగోలు చేసిన ఓ మ్యూజిక్ కంపెనీ అతడికి రూ.3 లక్షల వరకు రెమ్యునరేషన్ కూడా ఇచ్చింది. కచ్చా బాదమ్ విక్రయిస్తారా అని అడిగితే.. స్టార్ డమ్ వచ్చిన తర్వాత మళ్లీ నేను పల్లీలు అమ్మనని అలా బయటకు వస్తే కిడ్నాప్ కూడా చేస్తారేమోనని బద్యాకర్ చెప్పుకొచ్చాడు.
Read Also : Kacha Badam : ‘కచ్చా బాదమ్’ సింగర్ భుబన్‌కు రూ.3 లక్షల రెమ్యునరేషన్..! అతడి కష్టానికి ఇంతేనా?