ముగిసిన కైలాశ్-మానస సరోవర్ యాత్ర

జూన్-8,2019న ప్రారంభమైన వార్షిక కైలాశ్-మానస సరోవర్ యాత్ర ముగిసిందని అధికారులు ప్రకటించారు. ఉత్తరాఖండ్ లోని లిపులేఖ్ పాస్ మీదుగా మానససరోవర్ యాత్ర ఇవాళ(సెప్టెంబర్-08,2019) ముగిసిందని అధికారులు ఓ ప్రకటనలోతెలిపారు. ఆదివారం 41 మందితో కూడిన భారత యాత్రికుల చివరి బృందం టిబెట్ నుంచి ఉదయం 7.30 గంటల సమయంలో భారత్ కు చేరుకున్నట్లు చెప్పారు.

నిగమ్ లోని బుందీ క్యాంపులో విశ్రాంతి తీసుకున్న తర్వాత ఢిల్లీలో మార్గంలోని ఫితోరగఢ్ కు చేరుకుంటారని పితోరగఢ్ క్యాంపులోని కుమాన్ మండల్ వికాస్ నిగమ్(KMVN) ఇన్ ఛార్జ్ దినేశ్ గురురాని తెలిపారు. అమర్ నాథ్ యాత్రకు KMVN నోడల్ ఏజెన్సీ.

ఉత్తరాఖండ్ లోని లిపులేఖ్ మార్గం గుండా ఈ ఏడాది 727మంది పురుషులు,198మంది మహిళలు కలిపి మొత్తంగా 949మంది భక్తులు కైలాశ్-మానససరోవర్ యాత్రకు వెళ్లగా అందులో 23మంది వ్యక్తిగత కారణాలతో మధ్యలోనే వెనుదిరిగి వచ్చేశారని దినేశ్ గురురాని తెలిపారు. యాత్ర సమయంలో 26వ బ్యాచ్ కి చెందిన ఓ వ్యక్తి గుండెపోటుతో మరణించాడన్నారు. అయితే గతేడాది కన్నా ఈ ఏడాది యాత్ర చాలా ప్రశాంతంగా జరిగిందన్నారు.

ట్రెండింగ్ వార్తలు