Kalicharan Maharaj : గాంధీపై విమర్శలు,గాడ్సేపై పొగడ్తలు..కాళీచరణ్ మహరాజ్ అరెస్ట్

ప్రముఖ మత గురువు కాళీచరణ్ మహారాజ్ ను మధ్యప్రదేశ్ లో పోలీసులు అరెస్ట్ చేశారు. మహాత్మ గాంధీపై అనుచిత వ్యాఖ్యలు చేశారన్న కారణంతో కాళీచరణ్ మహారాజ్ ను గురువారం ఉదయం కజురహోలో పోలీసులు

Kalicharan

Kalicharan Maharaj : ప్రముఖ మత గురువు కాళీచరణ్ మహారాజ్ ను మధ్యప్రదేశ్ లో పోలీసులు అరెస్ట్ చేశారు. మహాత్మ గాంధీపై అనుచిత వ్యాఖ్యలు చేశారన్న కారణంతో కాళీచరణ్ మహారాజ్ ను గురువారం ఉదయం కజురహోలో పోలీసులు అరెస్ట్ చేశారు. ఖజురహో నుంచి ఆయనను రాయ్ పూర్ కి తరలించనున్నారు. మహావైపు,ఇటీవల హరిద్వార్ జరిగిన ధర్మసంసద్,ఆ తర్వాత ఢిల్లీలో జరిగిన ఓ ఈవెంట్ లో పలువురు చేసిన విద్వేష ప్రసంగాలే దేశవ్యాప్తంగా హాట్ టాపిక్ గా మారిన సమయంలో ఈ అరెస్ట్ కీలకంగా మారింది.

అసలేం జరిగింది
డిసెంబర్-26,2021న ఛత్తీస్‌ఘడ్ రాష్ట్రంలోని రాయ్ పూర్ ధరమ్ సంసద్ కార్యక్రమంలో కాళీచరణ్ మాట్లాడుతూ గాంధీజిని దూషించడంతోపాటు మహాత్మాగాంధీజీని చంపిన నాథూరామ్ గాడ్సేను ప్రశంసించారు. రాజకీయాల ద్వారా దేశాన్ని వశపర్చుకోవాలని ఇస్లాం మతం చూస్తోంది. గాంధీ మన దేశాన్ని విధ్వంసం చేశారు. ఆయనను చంపిన నాథూరాం గాడ్సేకు వందనాలు. హిందూ మతాన్ని రక్షించేందుకు సరైన నాయకుడిని ఎన్నుకోవాలి. అయితే ఈ ప్రసంగాన్ని విని కార్యక్రమ అతిథి మహంత్ రామ్ సుందర్ దాస్ కోపగించుకున్నారు. ఇటువంటి వ్యాఖ్యలు చేస్తుంటే ఎందుకు ఖండించడం లేదంటే కార్యక్రమ నిర్వహకులను ఆయన ప్రశ్నించారు. ఆ వెంటనే అక్కడి నుంచి వెళ్లిపోయారు.

అయితే మహాత్మాగాంధీజీని దూషించి,గాడ్సేను పొగిడిన కాళీచరణ్ మహారాజ్ పై రాయ్‌పూర్ మాజీ మేయర్ ప్రమోద్ దూబే ఫిర్యాదు మేర రాయ్ పూర్‌లోని తిక్రపారా పోలీస్ స్టేషన్‌లో కేసు నమోదైంది. కాళీచరణ్ పై పలు సెక్షన్ల కింద పోలీసులు కేసు నమోదు చేశారు. రాయ్‌పూర్‌లో కేసు నమోదు అయిన వెంటనే కాళీచరణ్ మహారాజ్ ఛత్తీస్‌గఢ్ నుంచి తప్పించుకున్నట్లు సమాచారం. కాళీచరణ్ ను పట్టుకునేందుకు రాయ్ పూర్ నుంచి మూడు పోలీసు బృందాలు…మహారాష్ట్ర, మధ్యప్రదేశ్‌,ఢిల్లీకి వెళ్లాయి. గురువారం తెల్లవారుజామున నాలుగు గంటల సమయంలో మధ్యప్రదేశ్ లోని కజురహోకి 25 కి.మీ దూరంలోని భాగేశ్వర్ ధామ్ కి దగ్గర్లోని ఓ అద్దె నివాసంలో ఉన్న కాళీచరణ్ మహారాజ్ ని రాయ్ పూర్ పోలీస్ బృందం అరెస్ట్ చేసింది. కాళీచరణ్ మహారాజ్ ని రాయ్ పూర్ కి తీసుకొస్తున్నట్లు రాయ్ పూర్ ఎస్పీ ప్రశాంత్ అగర్వాల్ తెలిపారు.

మరోవైపు,కాళీచరణ్ మహారాజ్ పై మహారాష్ట్రలోని థానేలో కూడా కేసు నమోదైంది. గాంధీజీపై కాళీచరణ్ మహారాజ్ మహారాజ్ వ్యాఖ్యలు తమను బాధపెట్టాయంటూ మహారాష్ట్ర మంత్రి,ఎన్సీపీ నేత జితేంద్ర అవద్..  థానే ఎన్సీపీ చీఫ్ ఆనంద్ పరంజ్పీతో కలిసి వెళ్లి నౌపడా పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేశారు. మతపరమైన భావాలను కించపరిచేలా ఉద్దేశపూర్వకంగా, ద్వేషపూరితంగా వ్యవహరించడంతోపాటు ఇతర నేరాలకు పాల్పడినందుకు గాను కాళీచరణ్ పై పలు సెక్షన్ల కింద కేసు నమోదు చేసినట్లు నౌపడ పోలీస్ స్టేషన్ అధికారి తెలిపారు.

ALSO READ Muhammad ali jinnah tower : గుంటూరులో జిన్నా టవర్ పేరు మార్చాలి : సోము వీర్రాజు