బాలీవుడ్ నటి కంగనా రనౌత్ ముంబై నుంచి మండిలోని తన గ్రామానికి తిరిగి వచ్చారు. కానీ మహారాష్ట్ర ప్రభుత్వం మరియు శివసేనపై మాత్రం నిరంతరం దాడి చేస్తున్నారు. మహారాష్ట్ర ముఖ్యమంత్రి ఉద్దవ్ ఠాక్రే, అతని కుమారుడు ఆదిత్య ఠాక్రేలను నిరంతరం లక్ష్యంగా చేసుకుని విమర్శలు చేస్తుంది. సుశాంత్ కిల్లర్స్, మూవీ మాఫియాస్ అంటూ విరుచుకుపడుతుంది కంగనా.
ఈ క్రమంలోనే మహారాష్ట్ర సీఎం కొడుకు ఆదిత్య ఠాక్రే టార్గెట్‌గా డ్రగ్ రాకెట్ ముఠాల గుట్టును బయటపెట్టడం మహారాష్ట్ర సీఎంకు సమస్యగా మారిందని, ఎందుకంటే ఈ మూడింటితో ఆయన కుమారుడు ఆదిత్య చెట్టాపట్టాలేసుకుంటూ తిరుగుతున్నారని ధ్వజమెత్తారు. ఈ వ్యవహారాలను బయటపెట్టడమే తాను చేసిన అతిపెద్ద నేరమని, అందుకే తనపై కక్షగట్టినట్లు శివసేన ప్రభుత్వం వ్యవహరిస్తోందని ఆరోపించారు.
మాఫియా ప్రేమికుడు అవినీతి సోనియా సైన్యం:
కంగనా రనౌత్ మరొక ట్వీట్‌లో.. శివసేన మరియు కాంగ్రెస్ సంకీర్ణ ప్రభుత్వాన్ని లక్ష్యంగా చేసుకుని, దేవేంద్ర ఫడ్నవిస్‌కు మద్దతు పలికారు. “ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవిస్ ఉండి ఉంటే, మాఫియా ప్రేమికుడు అవినీతి సోనియా ఆర్మీ ప్రభుత్వం కాకపోతే, ముంబై పోలీసులు గొప్పగా పని చేసేవారని అన్నారు. ప్రజలు మరియు మీడియా న్యాయం కోసం పోరాడవలసిన అవసరం ఉండేది కాదని ఖచ్చితంగా చెప్పగలను” అని ఆయన రాశారు.
https://10tv.in/history-will-judge-your-silence-kangana-ranaut-targets-sonia-gandhi/
కంగనా మహారాష్ట్ర సంకీర్ణ ప్రభుత్వాన్ని లక్ష్యంగా చేసుకుని, ఇదేమీ శాశ్వతం కాదని, సోనియా ఆర్మీ శక్తి అయిపోతుందని అన్నారు. “మీరు నియంతృత్వంగా ప్రభుత్వం నడపగలరని మీరు అనుకుంటున్నారా? ఇది మీకు, మీ మొత్తం సోనియా సైన్యం అధికారానికి దూరం అయ్యే సమయంగా మారవచ్చు. అని అన్నారు.