Kangana Ranaut
Kangana Ranaut : దేశ రాజధాని నగరమైన ఢిల్లీలో జరిగిన దసరా ఉత్సవాల్లో కీలక ఘటన చోటుచేసుకోనుంది. ఢిల్లీలోని లవ్ కుశ్ రామ్ లీలా మైదానంలో రావణ్ దహన్ కార్యక్రమాన్ని మొట్టమొదటిసారి మహిళా సెలబ్రిటీ, ప్రముఖ బాలీవుడ్ నటి కంగనా రనౌత్ చేయనున్నారు. ఈ ఏడాది కంగనా రనౌత్ ఢిల్లీలో దసరా ఉత్సవాలు జరుపుకోనున్నారు. సాధారణంగా ఢిల్లీలోని లవ్ కుశ్ రామ్ లీలా మైదానంలో రావణుడి దహనం కార్యక్రమాన్ని ప్రధానమంత్రి చేస్తుంటారు.
Also Read : Hamas releases : హమాస్ సంచలన నిర్ణయం…మానవతా దృక్పథంతో ఇద్దరు ఇజ్రాయెలీ బందీల విడుదల
ఈ ఏడాది సాధారణ ఎన్నికల నేపథ్యంలో ప్రధాని మోదీ బిజీగా ఉన్నారు. దీంతో పాటు ఈ ఏడాది మహిళా రిజర్వేషన్ బిల్లుకు పార్లమెంటు ఆమోదం తెలిపిన నేపథ్యంలో ఈ సారి మహిళా సెలబ్రిటీ కంగనా రనౌత్ ను రావణ్ దహన్ కార్యక్రమానికి రామ్ లీలా కమిటీ ఆహ్వానించింది. ఈ మెగా ఈవెంటుకు పలువురు సెలబ్రిటీలు హాజరవుతున్నా, రావణ్ దహన్ కార్యక్రమాన్ని మాత్రం కంగనా చేయనున్నారు.
Also Read : CM KCR : టార్గెట్ కాంగ్రెస్.. హస్తం పార్టీని కట్టడి చేసేలా కేసీఆర్ వ్యూహం
దీంతో రాంలీలా మైదానంలో రావణ్ దహన్ చేసిన మొట్టమొదటి మహిళగా కంగనా నిలవనున్నారు. ఆర్‌ఎస్‌విపి నిర్మించిన తేజస్ టైటిల్ రోల్‌లో కంగనా రనౌత్ నటించింది. సర్వేష్ మేవారా ఈ సినిమాకు దర్శకత్వం వహించారు. ఈ చిత్రాన్ని రోనీ స్క్రూవాలా నిర్మించారు. ఈ చిత్రం అక్టోబర్ 27వతేదీన థియేటర్లలో విడుదల చేయనున్నారు.