Karnataka Election 2023: ప్రధాన పార్టీల చూపంతా బెంగళూరుపైనే.. తుది అంకానికి చేరిన ఎన్నికల ప్రచారం..

కర్ణాటక ఎన్నికల్లో భాగంగా ప్రధాన పార్టీల చూపంతా బెంగళూరుపైనే ఉంది. కర్ణాటకలో ఏ పార్టీ అధికారం చేపట్టాలన్నా బెంగళూరు అర్బన్‌ కీలకంగా మారింది.

Karnataka Election 2023: కర్ణాటక రాష్ట్రంలో అసెంబ్లీ ఎన్నికల ప్రచారం తుది అంకానికి చేరుకుంది. రేపటితో ప్రచార పర్వానికి తెరపడనుంది. రాష్ట్రంలో బీజేపీ, కాంగ్రెస్, జేడిఎస్ పార్టీల నేతలు విస్తృతంగా ప్రచారం నిర్వహిస్తున్నారు. ఇంటింటికి వెళ్తూ ఓటర్లను తమ పార్టీకి ఓటు వేయాలని అభ్యర్థిస్తున్నారు. మూడు పార్టీల అగ్రనేతలు ర్యాలీలు, బహిరంగ సభల్లో పాల్గొంటూ పార్టీ అభ్యర్థుల విజయంకోసం విస్తృత ప్రచారం చేస్తున్నారు. ప్రధాని నరేంద్ర మోదీ రోడ్ షోలు, బహిరంగ సభల్లో పాల్గొంటున్నారు. ఆదివారంసైతం పలు ప్రాంతాల్లో రోడ్ షోలు, బహిరంగ సభల్లో పాల్గొని ప్రసంగించనున్నారు. కాంగ్రెస్ నుంచి సోనియా గాంధీ, రాహుల్ గాంధీ, ప్రియాంక, మల్లిఖర్జున్ ఖర్గే లతో పాటు ఇతర సీనియర్ నేతలు కర్ణాటక ఎన్నికల ప్రచారంలో పాల్గొంటూ కాంగ్రెస్ విజయానికి కృషి చేస్తున్నారు.

karnataka election 2023 : ప్రధాని మోదీ చుట్టూ కన్నడ రాజకీయాలు .. మోదీ, కాంగ్రెస్‌ మధ్య యుద్ధంగా మారిన ఎన్నికలు

బెంగళూరుపైనే చూపంతా..

కర్ణాటక ఎన్నికల్లో భాగంగా ప్రధాన పార్టీల చూపంతా బెంగళూరుపైనే ఉంది. కర్ణాటకలో ఏ పార్టీ అధికారం చేపట్టాలన్నా బెంగళూరు అర్బన్‌ కీలకంగా మారింది. ఇక్కడ 28స్థానాల్లో మెజారిటీ సాధించిన పార్టీనే ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసిన చరిత్ర ఉంది. దీంతో అర్బన్ ఓటర్లను ఆకర్షించడమే లక్ష్యంగా ప్రధాన పార్టీలు వ్యూహాత్మకంగా ముందుకెళ్తున్నాయి. 2008 ఎన్నికల్లో మెజారిటీ స్థానాలను బీజేపీ గెలిచింది. 2013, 2018 ఎన్నికల్లో మెజారిటీ స్థానాలను కాంగ్రెస్  గెలిచింది. అయితే ఈ సారి ఎన్నికల్లో బీజేపీ, కాంగ్రెస్ పార్టీలు నువ్వానేనా అన్నట్లుగా తలపడుతున్నాయి. ప్రచారపర్వాన్ని హోరెత్తిస్తున్నాయి. స్థానిక పార్టీ అయిన జేడీ(ఎస్) ప్రాబల్యం అంతగా కనిపించడం లేదని తెలుస్తోంది.

Karnataka Election 2023 : పెరట్లోని చెట్టుపై మూట, మూటలో కోటి రూపాయలు .. కన్నడనాట సిత్రాలు ఇసిత్రాలు..!!

సర్వేలో బీజేపీకే అధిక స్థానాలు ..

బెంగళూరులో ఈసారి బీజేపీ‌కే ఎక్కువ సీట్లు అంటూ జన్‌కి బాత్ సర్వే పేర్కొంది. గ్రేటర్ బెంగళూరులో మొత్తం 32 స్థానాలకుగాను బీజేపీకి 15, కాంగ్రెస్ పార్టీకి 14, జేడీ(ఎస్) మూడు స్థానాల్లో విజయం సాధిస్తాయని సర్వే ఫలితాలను సంస్థ వెల్లడించింది. అయితే, ప్రతీయేటా బెంగళూరు ప్రజలను వర్షాలు ఇబ్బంది పెడుతున్నాయి. ఐటీ కార్యాలయాలు ఉండే మహదేవపుర, బెళ్లందూరు, కోరమంగళ, వైట్‌ఫీల్డ్‌, ఔటర్‌ రింగ్‌రోడ్డు ప్రాంతాల్లోని ఐటీ కార్యాలయాలు మునిగిపోవడంతో అర్బన్ ప్రజలు కొంత అసహనంతో ఉన్నారు. శాంతినగర, బెంగళూరు సెంట్రల్‌, సి.వి.రామన్‌ నగర, పులకేశినగరలో తమిళ ఓటర్ల ప్రభావం ఎక్కువగా ఉంది. మహదేవపుర, బీటీఎం లేఔట్‌, యెలహంక, హెబ్బాళ, యశ్వంతపుర, కేఆర్‌పురలో తెలుగు ఓటర్ల ప్రభావం ఎక్కువగా ఉంటుంది. మరోవైపు.. శివాజీనగర, చామరాజపేటలో ముస్లింలు, చిక్కపేటలో హిందీ ఓటర్ల ప్రాబల్యం ఎక్కువగా ఉంటుంది. అయితే, ఈ ప్రాంతాల్లో ధరల పెరుగుదలను క్రమబద్ధీకరణలో బీజేపీ విఫలమంటూ పేద వర్గాల ప్రజలు ఎక్కువశాతం మంది అసహనంతో ఉన్నారు.

Karnataka Election 2023 : కర్ణాటక ఎన్నికల ప్రచారంలో కాంగ్రెస్, జేడీఎస్‌లపై సంచలన వ్యాఖ్యలు చేసిన ప్రధాని మోదీ..

గట్టిగానే పనిచేస్తున్న హిందుత్వ అంశం..

కర్ణాటక ఎన్నికల్లో హిందుత్వ అంశం గట్టిగానే పనిచేస్తున్నట్లు కనిపిస్తోంది. కాంగ్రెస్ పార్టీ తన మ్యానిఫెస్టో‌లో ‘భజరంగ్ దళ్’ ను బ్యాన్ చేస్తామంటూ ప్రకటించింది. ఇదే హామీ కాంగ్రెస్‌కు బ్యాక్ ఫైర్ అయినట్లు కనిపిస్తోంది. బీజేపీ ఈ అంశాన్ని ప్రజల్లోకి బలంగా తీసుకెళ్తుంది. తద్వారా హిందుత్వ వాదాన్ని బలంగా వినిపిస్తోంది. మరోవైపు ప్రధాని నరేంద్ర మోదీ రోడ్ షోలు, బహిరంగ సభలతో సమీకరణాలు మారినట్లు కనిపిస్తోంది. మోదీసైతం బజరంగ్ దళ్ అంశాన్ని ప్రస్తావిస్తూ కాంగ్రెస్ పై విమర్శలు చేస్తున్నారు. ‘జై బజరంగ్ బలి’ అంటూ జపించండి, పోలింగ్ రోజు పోలింగ్ బూత్ కు వెళ్లి జై బజరంగ్ బలి అని బీజేపీ ఓటేయాలని ప్రధాని నరేంద్ర మోదీ ఓటర్లకు పిలుపునిస్తున్నారు.

ట్రెండింగ్ వార్తలు