Karnataka Election 2023 : కర్ణాటక ఎన్నికల ప్రచారంలో కాంగ్రెస్, జేడీఎస్‌లపై సంచలన వ్యాఖ్యలు చేసిన ప్రధాని మోదీ..

కాంగ్రెస్, బీఆర్ఎస్ పార్టీలతో ప్రజలు జాగ్రత్తగా ఉండాలని మోదీ అన్నారు. ఆ రెండు పార్టీలు అవినీతిని ప్రోత్సహించడమే కాకుండా, సమాజాన్ని విభజించే రాజకీయాలు చేస్తున్నాయి అంటూ విమర్శించారు.

Karnataka Election 2023 : కర్ణాటక ఎన్నికల ప్రచారంలో కాంగ్రెస్, జేడీఎస్‌లపై సంచలన వ్యాఖ్యలు చేసిన ప్రధాని మోదీ..

pm Narendra modi

Karnataka Election 2023 : కర్ణాటక అసెంబ్లీ ఎన్నికలకు పోలింగ్ తేదీ దగ్గర పడుతుండటంతో బీజేపీ ప్రచారపర్వంలో వేగం పెంచింది. ప్రధాని నరేంద్ర మోదీ వరుసగా ర్యాలీలు, సభలు నిర్వహిస్తున్నారు. మరోవైపు బీజేపీ అగ్రనేతలు, రాష్ట్ర స్థాయి నేతలు విస్తృత ప్రచారం నిర్వహిస్తున్నారు. కాంగ్రెస్ పార్టీసైతం ప్రచారపర్వంలోవేగాన్ని పెంచింది. పార్టీ అగ్రనేతలు రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీలతో పాటు మల్లిఖర్జున్ ఖర్గే, ఇతర ముఖ్యనేతలు కర్ణాటక ఎన్నికల ప్రచారంలో పాల్గొంటున్నారు.

Karnataka Election 2023 : ప్రతి మహిళకు నెలకు రూ.2వేలు.. కర్ణాటకలో కాంగ్రెస్ ఎన్నికల మేనిఫెస్టో విడుదల ..

కర్ణాటక ఎన్నికల ప్రచార గడువు ముగియడానికి మరో వారంరోజులు మాత్రమే సమయం ఉండటంతో బీజేపీ ఎన్నికల ప్రచారంలో వేగం పెంచింది. ప్రధాని నరేంద్ర మోదీ మంగళవారం చిత్రదుర్గలో జరిగిన బహిరంగ సభలో పాల్గొని ప్రసంగించారు. ఈ సందర్భంగా ఆయన కాంగ్రెస్, జేడీఎస్ పార్టీలపై తీవ్ర స్థాయిలో విమర్శలు చేశారు. కాంగ్రెస్, జేడీఎస్ పార్టీలు రెండు అవినీతిని ప్రోత్సహించే పార్టీలని అన్నారు. కనిపించడానికి ఆ రెండు పార్టీలు వేరు. మనసులో, చేతల్లో మాత్రం ఒకటేనని మోదీ విమర్శించారు.

Karnataka Election 2023 : కర్ణాటకలో బీజేపీ ‘అ..ఆ’ల జపం .. అవేమిటో తెలుసా..?

అభివృద్ధి చెందిన భారతదేశానికి కర్ణాటకను చోదకశక్తిగా, అభివృద్ధి చెందిన భారతదేశ అభివృద్ధి ఇంజిన్‌గా మార్చాల్సిన అవసరం ఉందని మోదీ అన్నారు. దీన్ని సాధించడానికి మేము డబుల్ ఇంజిన్ ప్రభుత్వాన్ని మళ్లీ అధికారంలోకి తీసుకురావాలని, అందుకు ప్రజలంతా సహకరించాలని, బీజేపీకి మద్దతు పలకాలని మోదీ కోరారు.

karnataka Election 2023 : కర్ణాటక ఎన్నికల్లో ఏకైక ట్రాన్స్ జెండర్ అభ్యర్థి .. ఎవరీ రామక్క..!

కాంగ్రెస్, బీఆర్ఎస్ పార్టీలతో ప్రజలు జాగ్రత్తగా ఉండాలని మోదీ అన్నారు. ఆ రెండు పార్టీలు అవినీతిని ప్రోత్సహించడమే కాకుండా, సమాజాన్ని విభజించే రాజకీయాలు చేస్తున్నాయి అంటూ విమర్శించారు. ఆ రెండు పార్టీల ప్రాధాన్యత కర్ణాటక అభివృద్ధి కాదు.. మీ పిల్లలతో వారికి ఎలాంటి సంబంధం లేదు.. వారి అభివృద్ధే వారికి ముఖ్యం అంటూ తీవ్ర స్థాయిలో మోదీ విమర్శలు గుప్పించారు. రాష్ట్రంలో కాంగ్రెస్ ఉన్నంత కాలం ఇక్కడ అభివృద్ధి జరగలేదు. కానీ బీజేపీ అనేక అభివృద్ధి పథకాలతో రాష్ట్రాన్ని అన్ని రంగాల్లో ముందుకు తీసుకెళ్తోందని ప్రధాని మోదీ అన్నారు. అందులోభాగంగా హైవే, రైల్వే , విమానాశ్రయాలను బడ్జెట్లో చేర్చారని మోదీ తెలిపారు. మళ్లీ రాష్ట్రంలో బీజేపీ ప్రభుత్వానికి ప్రజలు మద్దతు పలకాలి. తద్వారా రాష్ట్రం అన్ని రంగాల్లో అభివృద్ధి చెందేలా సహకరించాలని మోదీ కోరారు.