Karnataka Sparrow tomb : పిచ్చుక మృతి..ఊరంతా విషాదం..అంత్యక్రియలు చేసి..సమాధి కట్టి ప్రత్యేక పూజలు

పిచ్చుక మృతికి ఊరంతా విలపించింది. ఆ పిచ్చుకకు అంత్యక్రియలు చేసి..సమాధి కట్టి ప్రత్యేక పూజలు చేశారు.

Karnataka Villagers Pay Tribute To The Sparrow

Karnataka Villagers pay tribute to the sparrow : పిచ్చుల సంఖ్య బాగా తగ్గిపోయింది. అయినా ప్రతీ ప్రతీ గ్రామంలోను..పట్టణాల్లో కూడా పిచ్చుకలు కనిపిస్తుంటాయి. కానీ ఓ గ్రామంలో ఓ పిచ్చుక చనిపోవటంతో మొత్తం ఊరు ఊరంతా శోక సముద్రంలో మునిగిపోయింది. ఏదో ఓ పిచ్చుక చనిపోతే పెద్దగా ఎవ్వరు పట్టించుకోరు. కానీ ఆ గ్రామస్తులు మాత్రం సొంత మనిషి చనిపోతే ఎలా విలపిస్తారో అలా విలపించారు. ఓ పిచ్చుక చనిపోతే గ్రామస్తులంతా అంతగా విలపిస్తున్నారు అంటూ ఆ మూగ ప్రాణితో వారికున్న అనుబంధం ఎంతగానో ఉండి ఉంటుంది…ఆ పిచ్చుకకు శాస్త్రోక్తంగా అంత్యక్రియలు నిర్వహించి..ప్రత్యేక పూజలు చేశారు.దానికి సమాధి కూడా కట్టి ఘనంగా నివాళులు అర్పించారు..

Also read : నెమలి పాడె మోస్తూ అంత్యక్రియలు చేసిన అధికారులు: జాతీయపక్షికి గౌరవం

కర్ణాటకలోని చిక్ బళ్లాపూర్ జిల్లా శిడ్లఘట్ట తాలూకా బసవ గ్రామంలో ఓ పిచ్చుక చనిపోయింది. ఆ చిట్టి పిచ్చుక మృతి చెందటంతో గ్రామమంతా శోక సముద్రంలో మునిగిపోయింది. ఎంతగానో విలపించింది. సాధారంగా చాలా గ్రామాల్లో పిచ్చుకలు తిరుగుతున్నట్లుగానే బసవ గ్రామంలోనూ.. గ్రామ పరిసరాల్లో పిచ్చుకలు ఎక్కువగా సంచరిస్తుంటాయి. గ్రామస్తులు కూడా వాటికి గింజలు వేస్తూ ఉంటారు. చక్కగా మేత దొరకటంతో పిచ్చుకలు ప్రతీ రోజూ గుంపులుగా వస్తూ ఉంటాయి.

ఈ క్రమంలో గ్రామస్తులకు ఓ పిచ్చుక బాగా దగ్గరైంది. ప్రతి ఇంటి ఆవరణలోకీ వెళ్లి కిచ కిచలాడుతు ఒకటే సందడి చేసేది. ఇలా గ్రామస్తులందరికీ ఆ పిచ్చుక ప్రత్యేకమైపోయింది.బాగా దగ్గరయ్యేది. మనుషులు దగ్గరకొస్తే పిచ్చుకలు ఎగిరిపోతాయి. కానీ ఆ పిచ్చుక ఎగిరిపోయేదికాదు..సరికదా ఎవరైనా తనకు దగ్గరగా వస్తే వారి భుజాలపైనా..తలపైనా వాలేదు. అలా ఆ పిచ్చుక గ్రామస్తుల మనస్సుకు బాగా దగ్గరైంది. అది ఎంతగా ఆ పిచ్చుక ఒక్కరోజు కనిపించకపోతే చుట్టుపక్కలంతా వెతికేవారు.

Also read : జల్లికట్టు ఎద్దు అంత్యక్రియలకు 3వేల మంది హాజరు, లాక్ డౌన్ నిబంధనలు బేఖాతరు

అలా ఆ పిచ్చుక గ్రామస్తులకు బాగా దగ్గరైంది.ఆ పిచ్చుక ఇంటి ఆవరణలోకి వచ్చిందంటే శుభ శూచకంగా భావించేవారు. ఈక్రమంలో జనవరి 26న ఆ పిచ్చుక చనిపోయింది. తమకు ఎంతో చేరికైన ఆ పిచ్చుక మరణవార్త విని గ్రామస్తులంతా శోకసంద్రంలో మునిగిపోయారు. రోజూ అందరి ఇళ్ల వద్దకు వెళ్లే పిచ్చుక.. ఒక్కసారిగా దూరమవడాన్ని వారు తట్టుకోలేకపోయారు. సొంత మనసి చనిపోయినట్లుగా ఏడ్చారు. ఆ పిచ్చుక జ్ఞాపకాలు ఎప్పటికీ ఉండాలనే ఉద్దేశంతో ప్రజలంతా కలిసి చనిపోయిన పిచ్చుకకు సమాధి కట్టించారు. శాస్త్రోక్తంగా పూజలు చేయడమే కాకుండా దశదిన కర్మ కూడా జరిపించారు. ఆ పిచ్చుక మళ్లీ బతికిరావాలని కోరుకుంటూ.. బ్యానర్లు కూడా ఏర్పాటు చేశారు. ఈ వార్త ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.

Also read : జల్లికట్టు ఎద్దు అంత్యక్రియలకు 3వేల మంది హాజరు, లాక్ డౌన్ నిబంధనలు బేఖాతరు

సవితా రాయన్న మాట్లాడుతూ “ప్రతీ రోజూ ఉదయం ఆ పిచ్చుక మా వరండాలోకి వచ్చేది..సరిగ్గా 8 గంటలకు వచ్చేది. ఆ పిచ్చుక రాగానే టైమ్ చస్తే సరిగ్గా 8 అయ్యేది. అలా సమయం తప్పకుండా వచ్చేదని దాని కోసం నేను గింజలు వస్తే చక్కగా తిని ఏదో మనుషులు పలకరించినట్లుగా..రాగానే కిచ కిచలాడేదని..వేసిన గింజలు తినేసి వెళ్లిపోయేటప్పుడు కిచ కిచ మంటూ వెళ్లిపోతున్నానన్నట్లుగా అటూ ఇటూ తిరుగుతూ..కాస్త సందడి చేసి తుర్రుమని ఎగిరిపోయేదని తెలిపారు.అలా రోజు వచ్చే పిచ్చుకను చూస్తే మాకు ఎంతో సంతోషం కలిగేది. మా ఆత్మీయులు వచ్చినట్లుగా అనిపించేది. ఇప్పుడా పిచ్చుక చనిపోవటం చాలా బాధగా ఉందని కన్నీరుతో తెలిపారు.