జల్లికట్టు ఎద్దు అంత్యక్రియలకు 3వేల మంది హాజరు, లాక్ డౌన్ నిబంధనలు బేఖాతరు

దేశవ్యాప్తంగా కరోనా కట్టడికి చాలా స్ట్రిక్ట్ గా లాక్‌డౌన్ అమలు చేస్తున్నారు. కరోనా కట్టడికి లాక్ డౌన్ ఒక్కటే ఆయుధం అని ప్రభుత్వాలు చెబుతున్నాయి. ప్రజలు ఎవరూ ఇళ్ల నుంచి

  • Published By: veegamteam ,Published On : April 16, 2020 / 10:07 AM IST
జల్లికట్టు ఎద్దు అంత్యక్రియలకు 3వేల మంది హాజరు, లాక్ డౌన్ నిబంధనలు బేఖాతరు

దేశవ్యాప్తంగా కరోనా కట్టడికి చాలా స్ట్రిక్ట్ గా లాక్‌డౌన్ అమలు చేస్తున్నారు. కరోనా కట్టడికి లాక్ డౌన్ ఒక్కటే ఆయుధం అని ప్రభుత్వాలు చెబుతున్నాయి. ప్రజలు ఎవరూ ఇళ్ల నుంచి

దేశవ్యాప్తంగా కరోనా కట్టడికి చాలా స్ట్రిక్ట్ గా లాక్‌డౌన్ అమలు చేస్తున్నారు. కరోనా కట్టడికి లాక్ డౌన్ ఒక్కటే ఆయుధం అని ప్రభుత్వాలు చెబుతున్నాయి. ప్రజలు ఎవరూ ఇళ్ల నుంచి బయటకు రావొద్దని నెత్తీ నోరు బాదుకుంటున్నాయి. ఒక వేళ బయటకు వచ్చినా మాస్క్ లు తప్పనిసరిగా ధరించాలని, గుంపులుగా తిరగొద్దని సూచిస్తున్నాయి. స్టే హోం, స్టే సేఫ్ అని పదే పదే చెబుతున్నారు. అయినా కొందరు లాక్ డౌన్ నిబంధనలు బేఖాతరు చేస్తున్నారు. యథేచ్చగా వీధుల్లోకి వస్తున్నారు. గుంపులు గుంపులుగా తిరుగుతున్నారు.

తమిళనాడులో దారుణం జరిగింది. లాక్ డౌన్ నిబంధనలు ఉల్లంఘిస్తూ వేలాది మంది వీధుల్లోకి వచ్చారు. ఓ ఎద్దుకు అంత్యక్రియలు నిర్వహించారు. ఇప్పటికే తమిళనాడులో కరోనా విజృంభిస్తోంది. ప్రజలందరు సోషల్ డిస్టెన్స్ పాటించాలని… ఇళ్ల నుంచి ఎవరు బయటకు రావద్దని ప్రభుత్వాలు మొత్తుకుంటున్నా జనాలు మారడం లేదు. మదురై సమీపంలోని అనంగానల్లూరు దగ్గరున్న ముదవరపట్టి గ్రామంలో.. జల్లికట్టు ఉత్సవాల్లో మంచి పేరు పొందిన ఓ ఎద్దు మృత్యవాత పడింది. దాని అంత్యక్రియల్లో వేలాది మంది పాల్గొన్నారు. ఈ విషయం రచ్చ రచ్చ కావడంతో మేల్కొన్న పోలీసులు గ్రామస్తులపై కేసు నమోదు చేశారు. అయితే, అంత్యక్రియల నిర్వహణ సమయంలో ఎలాంటి అభ్యంతరం తెలపకుండా… ఎద్దు అంత్యక్రియలు ముగిసిన తర్వాత.. గ్రామస్తులపై కేసు నమోదు చేశారనే ఆరోపణలు ఉన్నాయి. 

సామాజిక దూర నిబంధన, సీఆర్సీసీ సెక్షన్ 144ను ఉల్లంఘించి ఎద్దు అంత్యక్రియల్లో పాల్గొన్నవారిపై పోలీసులు కేసు నమోదు చేశారు. ఈ ఎద్దు గ్రామంలోని స్థానిక ఆలయానికి(చెల్లాయి అమ్మన్) చెందినది. గ్రామానికి ప్రాతినిథ్యం వహిస్తూ వివిధ జల్లికట్టు పోటీల్లో పాల్గొంది. ఎన్నో పందాల్లో కప్పులు గెల్చింది. దీంతో ఈ ఎద్దుంటే గ్రామస్తులకు ఎంతో అభిమానం. మూడు వారాల క్రితం ఎద్దు అనారోగ్యానికి గురైంది. ఆహారం తీసుకోవడం మానేసింది. గ్రామస్తులు ఎద్దుని కంటికి రెప్పలా చూసుకున్నారు. దానికి చికిత్సలు కూడా చేయించారు. అయినా లాభం లేకపోయింది. ఎద్దు చనిపోయింది.

ఆ వృషభ రాజానికి ప్రజలు ఘనంగా వీడ్కోలు పలికారు. కరోనా, భౌతికదూరం, మాస్కులు గీస్కులు పట్టించుకోలేదు. ఇక ఎద్దు లేదనే వార్త తెలిసి కొందరు కన్నీళ్లు పెట్టారు. అంతమందిని కట్టడి చేయలేక పోలీసులు కూడా వారి వెంటనే నడిచారు. ఈ ఎద్దు చనిపోయిన వార్త తెలియడంతో.. ఆ గ్రామ ప్రజలే కాకుండా.. చుట్టుపక్కల గ్రామాల నుంచి కూడా పెద్ద సంఖ్యలో తరలివచ్చారు. మదురై సమీపంలో ఉన్న అనంగానల్లూరు జల్లికట్టుకు ప్రసిద్ధి. 

ఆ ఎద్దు అంటే తమకు ఎంతో అభిమానం అని గ్రామస్తులు చెప్పారు. దైవంతో సమానం అన్నారు. అందుకే ఘనంగా అంత్యక్రియలు నిర్వహించామన్నారు. అంత్యక్రియలకు ముందు ఎద్దు పార్థివ దేహాన్ని ఊరంతా తిప్పారు.

మధురై రెడ్ జోన్ కేటగిరీలో ఉంది. ఈ ప్రాంతంలో ఇప్పటివరకు 41 కరోనా పాజిటివ్ కేసులు నమోదు కావడం మరింత కలవరానికి గురిచేస్తోంది. ఈ సంఘటనను సీరియస్‌గా తీసుకున్న జిల్లా యంత్రాంగం… అంత్యక్రియలు నిర్వహించిన గ్రామస్తులపై ఎఫ్‌ఐఆర్ నమోదు చేసింది. ఏప్రిల్ 15 నాటికి మదురైలో లాక్‌డౌన్ ఉల్లంఘనలకు సంబంధించి మొత్తం మూడు వేలకు పైగా కేసులు నమోదు చేశారు పోలీసులు. కరోనా వ్యాప్తి చెందకుండా అంత్యక్రియలపై కేంద్రం, రాష్ట్రాలు ప్రభుత్వాలు ఆంక్షలు విధించడం తెలిసిందే. కేవలం ఐదుగురే హాజరు కావాలని షరతు ఉంది.