కరోనా స్వాహా : కోవిడ్-19 అంతం కోసం యాగం చేసిన బీజేపీ ఎమ్మెల్యే

  • Published By: nagamani ,Published On : June 1, 2020 / 11:50 AM IST
కరోనా స్వాహా : కోవిడ్-19 అంతం కోసం యాగం చేసిన బీజేపీ ఎమ్మెల్యే

Updated On : June 1, 2020 / 11:50 AM IST

ప్రపంచాన్ని వణికిస్తున్న కరోనా మహమ్మారి అంతం కావాలని హొన్నాళి బీజేపీ ఎమ్మెల్యే, సీఎం యాడ్యూరప్ప పొలిటికల్ సెక్రటరీ రేణుకాచార్య హిరెకెల్‌మాతా కోవిడ్-19కు వ్యతిరేకంగా ఆలయంలో సోమవారం (జూన్ 1,2020) యాగం నిర్వహించారు.  కరోనా వైరస్ సోకిన  బాధితుల కోసం ప్రత్యేకంగా నవగ్రహ పూజ చేశారు. ఈ పూజకు హాజరైన వారు ముఖానికి మాస్కులు ధరించి భౌతిక దూరం పాటించారు. 

కరోనా అంతం అయిపోవాలని ఒడిశాలోని కటక్ జిల్లా నర్శింగ్ పూర్ లో సూరజ్‌ కుమార్‌ ప్రధాన్‌ అనే  50 ఏళ్ల  వ్యక్తిని స్థానిక బ్రాహ్మణిదేవి ఆలయంలో పూజారి  నరబలి ఇచ్చాడు. హత్య చేసిన తర్వాత మృతదేహాన్ని ముక్కలు ముక్కలు చేయటం స్థానికంగా కలకలం రేపింది. స్థానికులు తీవ్ర భయభ్రాంతులకు గురయ్యారు. పూజారీ సంసారి హోజాను అదుపులోకి తీసుకుని విచారణను కొనసాగిస్తున్నారు.

తమిళనాడుకు చెందిన శ్రీనివాస్ సిద్ధార్థ అనే పూజారి కరోనా మహమ్మారిని అంతం చేసేస్తానంటు నానా హంగామా చేశాడు. పీకలోతు ఇసుకలో కప్పించేసుకుని చుట్టూ మంటలు పెట్టుకుని కరోనాను ప్రపంచం నుంచి అంతం కావాలని ప్రార్థనలు చేశాడు. కొన్ని ప్రాంతాల్లో కరోనా అమ్మవారిలో బొమ్మను తయారు చేసిన ఊరేగిస్తూ..పూజలు చేసిన విషయం తెలిసిందే.  

కాగా..కరోనా వ్యాప్తిలో భారత్ ప్రపంచంలోనే ఏడో స్థానానికి చేరింది. దేశవ్యాప్తంగా ఇప్పటి వరకు 1,90,535 కేసులు నమోదయ్యాయి. 93,322 కేసులు యాక్టివ్‌గా ఉన్నాయి. 91,819 మంది కోలుకుని డిశ్చార్జ్ కాగా, 5,394 మంది ప్రాణాలు కోల్పోయారు.

Read: గోవాలోకి నో ఎంట్రీ