MLA Daughter Slaps Woman SI : మహిళా ఎస్ఐ చెంప చెళ్లుమనిపించిన ఎమ్మెల్యే కుమార్తె.. ఆ తరువాత పోలీస్ స్టేషన్కు వెళ్లి..
MLA Daughter Slaps Woman SI
MLA Daughter Slaps Woman SI : ఎమ్మెల్యే కుమార్తె మహిళా ఎస్ఐ చెంపపై కొట్టిన ఘటన కర్ణాటక రాష్ట్రంలో తీవ్ర వివాదంకు దారితీసింది. మండ్య జిల్లాలోని శ్రీరంగపట్నం తాలూకాలోని అరతి ఉక్కాడ ఆలయంలో ఈ ఘటన చోటు చేసుకుంది.
Also Read : Indonesia Earthquake : ఇండోనేసియాలో భారీ భూకంపం.. సునామీ హెచ్చరికలు జారీ..
తమకూరు రూరల్ నియోజకవర్గం బీజేపీ ఎమ్మెల్యే సురేశ్ గౌడ కుమార్తె ఐశ్యర్య మండ్య మహిళా పోలీస్ స్టేషన్ ఎస్ఐ బి. సబిత పై చేయిచేసుకుంది. భీమన అమావాస్యను పురస్కరించుకొని మాండ్య సమీపంలోని ‘ఆరతి ఉక్కడ’లో అహల్యాదేవి ఆలయానికి ఎమ్మెల్యే కుమార్తె ఐశ్వర్య గత బుధవారం వెళ్లింది. వీఐపీ దర్శన మార్గంలో వెళ్తూ.. అక్కడ విధులు నిర్వహిస్తున్న ఎస్ఐ తో గొడవ జరిగింది.
అక్కడే ఉన్న సీఐ లక్ష్మీ ఆమెను వారిస్తున్న సమయంలోనే ఎస్ఐ సవిత చెంపపై కొట్టింది. దీంతో మహిళా ఎస్ఐ క్యాతనహళ్లి పోలీస్ స్టేషన్ లో ఐశ్వర్యపై బుధవారం రాత్రి 12గంటల సమయంలో ఫిర్యాదు చేయగా కేసు నమోదైంది. దీంతో భారతీయ న్యాయ సంహిత (BNS)లోని పలు సెక్షన్ల కింద ఎఫ్ఐఆర్ నమోదు చేశారు. మరోవైపు.. అర్ధరాత్రి ఒంటి గంట సమయంలో ఎమ్మెల్యే బీఎస్ సురేశ్ గౌడ కుమార్తె ఐశ్వర్య సైతం పోలీస్ స్టేషన్ కు వెళ్లి మహిళా ఎస్ఐ పై ఫిర్యాదు చేసింది.
ఈ ఘటనపై ఎమ్మెల్యే బీఎస్ సురేశ్ గౌడ స్పందిస్తూ.. తన కుమార్తెను పోలీసు అధికారిణి దూషించారని , ఆలయ గర్భగుడిలోకి వెళ్లేందుకు తన కుమార్తె అనుమతి కోరిందని, పోలీసులు ఆమెను అనుమతించలేదని తెలిపారు. ఈ సమయంలో స్వల్ప ఘర్షణ చోటు చేసుకోవటంతో దురదృష్టకర ఘటన జరిగి ఉండొచ్చని పేర్కొన్నారు.
తొలుత తన కుమార్తెను పోలీసు అధికారి దూషించినట్లు తెలిసిందని, ఆ తరువాతే గొడవ జరిగిందని ఎమ్మెల్యే చెప్పుకొచ్చారు. తన కుమార్తె ఎస్ఐను చెంపదెబ్బ కొట్టిన వీడియోను తాను చకూడలేదని, నిజంగా అలా జరిగి ఉంటే తాను మహిళా ఎస్ఐకు క్షమాపణలు చెబుతున్నానని పేర్కొన్నారు. ఇదిలాఉంటే ఐశ్వర్య భర్త కేసీ గౌతమ్ పోలీస్ శాఖలో డీవైఎస్పీగా సేవలు అందిస్తుండటం విశేషం.
