కర్ణాటక : ఉప ఎన్నికల పోలింగ్ ప్రారంభం

  • Publish Date - December 5, 2019 / 02:38 AM IST

కర్ణాటకలో 15 అసెంబ్లీ నియోజక వర్గాల్లో ఉప ఎన్నికల పోలింగ్ గురువారం ఉదయం ప్రారంభమైంది. కాంగ్రెస్, జేడీఎస్ సంకీర్ణ ప్రభుత్వం సమయంలో 17 మంది శాసనసభ్యులు రాజీనామా చేయటంతో ఉప ఎన్నికలు అనివార్యమయ్యాయి. రెండు నియోజకవర్గాల్లో న్యాయ సంబంధ కేసులు విచారణలో ఉన్నందున 15 అసెంబ్లీ స్ధానాల్లోనే  ఎన్నికలు నిర్వహిస్తున్నారు. కాంగ్రెస్,బీజేపీలు 15 స్ధానాల్లో, జేడీఎస్ 12, బీఎస్పీ 2, ఎన్ఎస్పీ 1 స్ధానం నుంచి పోటీ చేస్తున్నాయి.  రాజీనామా చేసిన  శాసన సభ్యులంతా అనర్హులని ప్రకటించిన కోర్టు ఈ ఎన్నికల్లో పోటీచేసే అవకాశం కల్పించింది. గత విధానసభ ఎన్నికల తర్వాత పొత్తు కుదుర్చుకుని ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసిన కాంగ్రెస్ జేడీఎస్ ఒంటరిగా బరిలోకి దిగాయి. ఈరోజు జరిగే పోలింగ్ కు ఓట్ల లెక్కింపు డిసెంబర్ 9న జరిపి ఫలితాలు వెల్లడిస్తారు.