Karnataka Cabinet
Karnataka Cabinet: కర్ణాటక (Karnataka) లో కాంగ్రెస్ ప్రభుత్వం కొలువుదీరిన విషయం విధితమే. సీఎంగా సిద్ధరామయ్య (CM Siddaramaiah), ఉప ముఖ్యమంత్రిగా శివకుమార్ (DK Shivakumar) లు ప్రమాణ స్వీకారం చేశారు. వీరితోపాటు తొలుత ఎనిమిది మంది ఎమ్మెల్యేలు మంత్రులుగా ప్రమాణ స్వీకారంచేశారు. రెండురోజుల క్రితం కేబినెట్ విస్తరణలో భాగంగా మరో 24 మంది ఎమ్మెల్యేలు మంత్రులుగా ప్రమాణ స్వీకారం చేశారు. కేబినెట్‌లో సిద్ధరామయ్య, శివకుమార్ తోపాటు మొత్తం 34 మంది ఉన్నారు. అయితే వీరిలో ఎవరికి ఏ శాఖ కేటాయిస్తారనే అంశం కర్ణాటక రాజకీయాల్లో ఆసక్తికరంగా మారింది. తాజాగా సీఎం సిద్ధరామయ్య మంత్రులకు శాఖలను కేటాయించారు. ఆర్థికశాఖను సిద్ధరామయ్య తనవద్దే ఉంచుకున్నారు. డీకే శివకుమార్‌కు ప్రధాన, మధ్యస్థ నీటిపారుదల శాఖ, బెంగళూరు పట్టణాభివృద్ధి శాఖలను కేటాయించారు.
కీలకమైన హోంశాఖను జి. పరమేశ్వర్‌కు కేటాయించారు. ఆరోగ్య, కుటుంబ సంక్షేమ శాఖను దినేష్ గుండూరావుకు, గ్రామీణాభివృద్ధి, పంచాయతీరాజ్ శాఖను ప్రియాంక్ ఖర్గేకు కేటాయించారు. వ్యవసాయశాఖను ఎన్. చెలువర్య స్వామికి కేటాయించారు. ఎక్సైజ్ శాఖను తిమ్మాపూర్ రామప్ప బాలప్పకు కేటాయించారు. సిద్ధరామయ్య కేబినెట్‌లో ఏకైక మహిళా మంత్రి లక్ష్మీ ఆర్ హెబ్బాల్కర్ కు స్త్రీ, శిశు సంక్షేమం, దివ్యాంగులు, సీనియర్ సిటిజన్ల సాధికారత శాఖలను కేటాయించారు.
Karnataka Congress : కర్ణాటకలో మంత్రి పదవుల పంచాయతీ .. ఎమ్మెల్యే రుద్రప్పకు మంత్రి పదవి కోసం డిమండ్
శాఖల కేటాయింపు వివరాలు ఇలా..
Karnataka Cabinet
Karnataka Cabinet
Karnataka Cabinet