karnataka election 2023 : కాంగ్రెస్ గెలుస్తుందని రెండు ఎకరాల తోట పందెం, చాటింపుతో సవాల్ .. బెట్టింగుల్లో భారీగా నగదు, వాహనాలు

దేశమంతా కర్ణాటక ఎన్నికల ఫలితాలవైపే చూస్తోంది. ఈరోజు ఏపార్టీది గెలుపో లేదా హంగో తేలిపోనుంది. ఈక్రమంలో కర్ణాటకలో జోరుగా బెట్టింగ్ లు జరుగుతున్నాయి. ఓ రైతు తన నియోజకవర్గంలోనే కాంగ్రెస్ అభ్యర్థే గెలుస్తాడంటూ రెండు ఎకరాల తోట పందెం కాసాడు. మరో వ్యక్తి బైక్ పందెంగా పెట్టాడు.ఇంకొకరు కోటి రూపాయలు ఇలా బెట్టింగ్ ల జోరు కొనసాగుతోంది.

karnataka election 2023

karnataka election 2023 : దేశమంతా కర్ణాటక ఎన్నికల ఫలితాలవైపే చూస్తోంది. కాంగ్రెస్ దే గెలుపు అనే సంకేతాలు వినిపిస్తున్నాయి. ఎగ్జిట్ పోల్స్ అంచనాలు కూడా ఇదే వెల్లడించాయి పోలింగ్ తరువాత. ఈరోజు ఏపార్టీది గెలుపో లేదా హంగో తేలిపోనుంది. ఈక్రమంలో కర్ణాటకలో జోరుగా బెట్టింగ్ లు జరుగుతున్నాయి. ఓ రైతు తన నియోజకవర్గంలోనే కాంగ్రెస్ అభ్యర్థే గెలుస్తాడంటూ రెండు ఎకరాల తోట పందెం కాసాడు. తన పందెం గురించి చాటింపు వేయించి మరీ సవాల్ చేశాడు. నేను కాంగ్రెస్ అభ్యర్థి గెలుస్తాడని రెండు ఎకరాలు పందెం కాసాను..మరి ఎవరైనా పోటీకొస్తారా? అంటూ సవాల్ చేస్తు గ్రామం అంతా చాటింపు వేయించాడు.తనతో పందెం కాసేవారు ఉంటే రావాలని డప్పు కొట్టి మరీ చాటింపు వేయించాడు.

కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల ఓట్ల లెక్కింపు ప్రక్రియ కొనసాగుతోంది. ఈక్రమంలో హొన్నాళ్లి నియోజకవర్గం నుంచి కాంగ్రెస్ అభ్యర్థి శాంతనగౌడ, బీజేపీ ఎమ్మెల్యే ఎంపీ రేణుకాచార్య బరిలో ఉన్నారు. వీరిద్దరిపైనా జోరుగా పందాలు జరుగుతున్నాయి. ఎవరికి తగినట్లుగా వారు పందాలు కాస్తున్నారు. దీంట్లో భాగంగా నాగన్న అనే వ్యక్తి కాంగ్రెస్ అభ్యర్థి శాంతనగౌడ గెలుస్తారని బల్లగుద్ది మరీ చెబుతున్నాడు. కావాలంటే పందెం కాయండీ అంటూ సవాల్ విసురుతున్నాడు. కాంగ్రెస్ అభ్యర్థి గెలుస్తారని తాను రెండెకరాల పొలాన్ని పందెం కాస్తున్నా..తనపై పందెం కాసేవారు ఉంటే ముందుకు రండీ అని సవాల్ చేస్తు గ్రామంలో డప్పు కొట్టి చాటింపు వేయించాడు. నాపై పందెం కాసేవారు గ్రామంలోని ఆంజనేయస్వామి గుడి వద్దకు రావాలని చాటింపు వేయించాడు. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.

ఇలా బెట్టింగ్ రాయుళ్లు పందాలు కాస్తు మాంచి జోరుమీదున్నారు. దీంట్లో భాగంగా కొండసీమల చామరాజనగర జిల్లాలోనూ బెట్టింగులు జోరుగా కొనసాగుతున్నాయి. సోమన్న గెలుస్తారంటూ కోటి రూపాయల వరకు పందాలు కాసినట్టు తెలుస్తోంది. గుండ్లుపేట తాలూకా మల్లయ్యనపుర గ్రామానికి చెందిన కిరణ్ తన చేతిలో రూ. 3 లక్షలు పట్టుకుని కాంగ్రెస్ గెలుస్తుందని పందెం కాశాడు. సోషల్ మీడియాలో వీడియో వైరల్ కావడంతో పోలీసులు పందెం రాయుళ్ల కోసం గాలిస్తున్నారు.

అలాగే వారణగెర నియోజకవర్గం కాంగ్రెస్ అభ్యర్థి డాక్టర్ షామనూరు శిశంకరప్ప, బీజేపీ అభ్యర్థి బిజి అజయ్ కుమార్ పై కూడా బెట్టింగులు జరుగుతున్నాయి. హరిహర, జగలూరు, మాయకొండ నియోజక వర్గాల్లో అభ్యర్థులు గట్టి పోటీ ఇస్తున్నారు. గెలిచే అవకాశం ఉన్న అభ్యర్థులకు అనుకూలంగా డబ్బులు, బైకులతో సహా జూదాలు జోరుగా జరుగుతున్నాయి.

 

ట్రెండింగ్ వార్తలు