ప్రేమ పెళ్లి చేసుకోకూడదని యువతి చేతి వేళ్లు కత్తిరించిన తండ్రి, సోదరుడు

love Marriage: యువతి తన లవర్‌ని పెళ్లి చేసుకుంటానని చెప్పడంతో తండ్రి, సోదరుడు కలిసి చేతి వేళ్లను కత్తిరించేశారు. కర్ణాటకలోని చామ్‌రాజ్‌నగర్‌లో ఈ ఘటన జరిగింది. బాధితురాలిని 24 సంవత్సరాల వయస్సున్న ధనలక్ష్మీగా గుర్తించారు. పీజీ పాల్యా గ్రామానికి చెందిన సత్య అనే వ్యక్తిని ప్రేమించింది.

రెండు సంవత్సరాల ప్రేమాయాణం తర్వాత ఒకరినొకరు అర్థం చేసుకుని పెళ్లి చేసుకోవాలని అనుకున్నారు. ఈ క్రమంలో ధనలక్ష్మీ ఆమె తల్లిదండ్రులకు విషయం చెప్పింది. వాళ్ల దానికి అభ్యంతరం చెప్పారు. వాళ్ల మాట వినకుండా సోమవారం సత్యని పెళ్లి చేసుకోవాలని ఫిక్స్ అయిపోయింది. ఆ విషయం తెలిసి యువతి కుటుంబ సభ్యులు ఆగ్రహానికి లోనయ్యారు.



శనివారం మెడికల్ స్టోర్ వద్ద ధనలక్ష్మితో తండ్రి, సోదరుడు కలిసి గొడవపడ్డారు. వాదన పెరిగిపోయింది. ఇద్దరు యువతిని గట్టిగా పట్టుకుని నాలుగు వేళ్లను కోసేశారు. స్థానికులు చూసి యువతిని కాపాడే ప్రయత్నం చేశారు. వారిద్దరి నుంచి విడిపించి ట్రీట్‌మెంట్ కోసం హాస్పిటల్ లో అడ్మిట్ చేశారు. నిందితులు ఇద్దరినీ పోలీసులు అరెస్టు చేశారు.