HD Kumaraswamy: అనారోగ్యంతో ఆస్పత్రిలో చేరిన కర్ణాటక మాజీ సీఎం.. కీలక సూచనలు చేసిన వైద్యులు

కర్ణాటక మాజీ సీఎం, జేడీఎస్ నాయకుడు కుమారస్వామి స్వల్ప అస్వస్థతకు గురయ్యారు. బెంగళూరులోని మణిపాల్ ఆస్పత్రిలో చేరారు.

HD Kumaraswamy: కర్ణాటక రాష్ట్రంలో అసెంబ్లీ ఎన్నికల కోలాహలం నెలకొంది. అభ్యర్థుల నామినేషన్ల ప్రక్రియ చివరి దశకు చేరుకుంది. రాష్ట్రంలో ప్రధాన పార్టీలైన బీజేపీ, కాంగ్రెస్, జేడీఎస్ పార్టీలు ప్రచారపర్వంలో వేగాన్ని పెంచాయి. ఆయా పార్టీల ముఖ్యనేతలు సుడిగాలి పర్యటనలు చేస్తున్నారు. ఈ క్రమంలో కర్ణాటక మాజీ సీఎం, జేడీఎస్ నాయకుడు హెచ్‌డీ కుమారస్వామి అస్వస్థతకు గురయ్యారు. అలసట కారణంగా శనివారం సాయంత్రం బెంగళూరులోని మణిపాల్ ఆస్పత్రిలో చేరారు.

Karnataka: కర్ణాటక ఎన్నికల ప్రచారంలో చిత్రమైన హామీలు.. ఆసక్తికర విన్యాసాలు

కర్ణాటకలో మే 10న ఎన్నికలు జరగనున్నాయి. మే 13న ఫలితాలు వెల్లడవుతాయి. అన్ని పార్టీలు ఆయా నియోజకవర్గాల్లో అభ్యర్థులను ప్రకటించాయి. జేడీఎస్ పార్టీ అభ్యర్థుల తరపున కుమార స్వామి రాష్ట్రంలో పర్యటనలు చేస్తున్నారు. కొద్దిరోజులగా రాష్ట్రంలో విస్తృత పర్యటనలు చేస్తున్న ఆయన అనారోగ్యం బారినపడ్డాడు. కుమారస్వామి అనారోగ్యంతో ఆస్పత్రిలో చేరినట్లు జనతాదళ్ సెక్యులర్ (జేడీఎస్) పార్టీ ఓ ప్రకటనలో తెలిపింది. అయితే, అతనికి వైద్య పరీక్షలు నిర్వహించిన వైద్యులు కీలక సూచనలు చేశారు.

HD Kumaraswamy : ఆ గ్రామాల పేర్లు మార్చవద్దు..కేరళ సీఎంకి కుమారస్వామి లేఖ

అలసట, సాధారణ బలహీనత లక్షణాలతో ఆస్పత్రిలో చేరిన కుమార స్వామి ఆరోగ్యం నిలకడగా ఉందని, ఎలాంటి ఆందోళన చెందాల్సిన పనిలేదని వైద్యులు చెప్పారు. అయితే, రెస్ట్ తీసుకోవాలని మణిపాల్ ఆస్పత్రి వైద్యులు ఒక ప్రకటనలో చెప్పారు. దీంతో కుమారస్వామి ఆదివారం రోజు చేపట్టాల్సిన కార్యక్రమాలను వాయిదా వేసుకున్నారు. పార్టీ కార్యకర్తలు తన ఆరోగ్యం గురించి కలత చెందరాదని విజ్ఞప్తి చేశారు.

ట్రెండింగ్ వార్తలు