HD Kumaraswamy : ఆ గ్రామాల పేర్లు మార్చవద్దు..కేరళ సీఎంకి కుమారస్వామి లేఖ

కేరళలోని కాసరగాడ్‌ జిల్లాలోని కన్నడలో ఉన్న కొన్ని గ్రామాల పేర్లను మలయాళంలోకి మ‌ార్చడంపై అభ్యత‌రం వ్య‌క్తం చేస్తూ సోమవారం కేరళ సీఎం పినరయి విజయన్ కి కర్ణాటక మాజీ సీఎం హెచ్ డీ కుమారస్వామి లేఖ రాశారు.

HD Kumaraswamy : ఆ గ్రామాల పేర్లు మార్చవద్దు..కేరళ సీఎంకి కుమారస్వామి లేఖ

Hdk

HD Kumaraswamy కేరళలోని కాసరగాడ్‌ జిల్లాలోని కన్నడలో ఉన్న కొన్ని గ్రామాల పేర్లను మలయాళంలోకి మ‌ార్చడంపై అభ్యత‌రం వ్య‌క్తం చేస్తూ సోమవారం కేరళ సీఎం పినరయి విజయన్ కి కర్ణాటక మాజీ సీఎం హెచ్ డీ కుమారస్వామి లేఖ రాశారు. భాషా సామరస్యం, సాంస్కృతిక సహజీవనం పేరిట పేరు మార్చే ప్రక్రియను నిలిపివేయాలని లేఖ ద్వారా కుమారస్వామి విజ్ఞప్తి చేశారు.

ప‌దేండ్లుగా కాసరాగోడ్ కేర‌ళ‌లో భాగం అయిన‌ప్ప‌టికీ క‌ర్ణాట‌క‌తో చాలా అనుబంధం ఉందని కుమారస్వామి గుర్తు చేశారు. ఈ ప్రాంతంలోని ప్ర‌జ‌లు ఇరు భాష‌ల సంస్కృతికి అల‌వాటు ప‌డ్డార‌ని, ఈ సంప్ర‌దాయాన్ని కొన‌సాగించాల‌ని కోరారు. కన్నడ గ్రామాల పేర్లను మలయాళంలోకి మార్చినప్పటికి వాటి అర్థం మాత్రం మారదుని.. అందుకని వాటి పేర్లను మార్చకుండా పాత కన్నడ పేర్లను కొనసాగించాలని లేఖలో కుమారస్వామి కోరారు. అనంతరం ట్విటర్‌ వేదికగా కుమారస్వామి స్పందిస్తూ.. కేరళలో నివసిస్తున్న కన్నడిగుల సంప్రదాయాలను కాపాడటం కేరళ, కర్ణాటక ముఖ్యమంత్రుల బాధ్యత అని పేర్కొన్నారు.