Karnataka Government Officer : కర్ణాటక ప్రభుత్వ అధికారిణి హత్య కేసులో వీడిన మిస్టరీ..! హంతకుడు వీడే..? హత్యకు కారణం తెలిసి పోలీసులు షాక్

శనివారం రాత్రి 8 గంటలకు డ్యూటీ ముగించుకుని తన ఇంటికి చేరుకున్నారు. ఇంటికి వచ్చిన కాసేపటికే ఆమె హత్యకు గురయ్యారు. Karnataka Government Officer Prathima Case

Karnataka Government Officer Prathima Case : కర్ణాటకలో ప్రభుత్వ అధికారిణి ప్రతిమ కేఎస్ (45) హత్య దేశవ్యాప్తంగా సంచలనం రేపిన సంగతి తెలిసిందే. మైన్స్ అండ్ జియాలజీ డిపార్ట్‌మెంట్‌ డిప్యూటీ డైరెక్టర్ గా పని చేస్తున్న ప్రతిమ సుబ్రహ్మణ్యపొరలోని తన ఇంట్లోనే హత్యకు గురయ్యారు. ఈ కేసు మిస్టరీగా మారింది. ప్రతిమను ఎవరు చంపారు? ఎందుకు హత్య చేశారు? అనేది సస్పెన్స్ గా మారింది.

కాగా ఈ కేసులో కీలక పరిణామం చోటు చేసుకుంది. ప్రతిమ మర్డర్ కేసులో పోలీసులు ఓ అనుమానితుడిని అరెస్ట్ చేశారు. ఆ వ్యక్తి ప్రతిమ కారు డ్రైవర్‌గా పని చేశాడని, 10 రోజుల క్రితం ప్రతిమ అతడిని ఉద్యోగం నుంచి తొలగించారని పోలీసులు చెప్పారు. ఉద్యోగం నుంచి తొలగించిందనే కోపంతో తానే ఈ హత్య చేసినట్లు నిందితుడు అంగీకరించినట్టు సమాచారం.

Also Read : భార్యను పొడిచి చంపిన భారతీయుడికి జీవిత ఖైదు విధించిన అమెరికా కోర్టు

పోలీసుల అదుపులో ఉన్న వ్యక్తి గత ఐదేళ్ల నుంచి కాంట్రాక్ట్ ఉద్యోగిగా పనిచేస్తున్నాడు. అయితే, తనను ఉద్యోగం నుంచి తొలగించడంతోనే కక్షగట్టి ప్రతిమను హత్య చేసినట్టు అతడు చెప్పినట్టు తెలుస్తోంది. అనుమానితుడిని కిరణ్‌గా గుర్తించారు పోలీసులు. హత్య తర్వాత అతడు చామరాజనగర్‌కు పారిపోయినట్టు పోలీసులు వెల్లడించారు.

రామనగర జిల్లాలో పనిచేసిన కేఎస్ ప్రతిమ బదిలీపై ఇటీవలే బెంగళూరుకు వచ్చారు. శనివారం రాత్రి 8 గంటలకు డ్యూటీ ముగించుకుని దొడ్డకల్లసంద్రలోని తన ఇంటికి చేరుకున్నారు. ఇంటికి వచ్చిన కాసేపటికే ఆమె హత్యకు గురయ్యారు. ఊపిరి ఆడకుండా చేసిన నిందితుడు, గొంతుకోసి హత్య చేసినట్టు పోలీసులు గుర్తించారు. ఐదేళ్లుగా ఆమె ఒంటరిగానే ఉంటున్నారని పోలీసులు చెప్పారు.

Also Read : షాకింగ్ వీడియో.. లైవ్‌లో యాంకర్ దారుణ హత్య, గన్‌తో కాల్చి చంపిన దుండగుడు

కాగా, ప్రతిమ డైనమిక్ లేడీగా గుర్తింపు పొందారు. ప్రతిమ చాలా ధైర్యవంతురాలు అని.. తనిఖీలు, నిందితులపై చర్యలు తీసుకునే విషయంలో చాలా నిక్కచ్చిగా వ్యవహరించే వారని సహచరులు తెలిపారు. ప్రతిమ ఎన్నో హైప్రొఫైల్​ కేసులు కూడా డీల్​ చేశారు. ఫలితంగా డైనమిక్​ లేడీగా గుర్తింపు వచ్చింది. ఎన్నో హై ప్రొఫైల్​ కేసులు డీల్​ చేసిన ప్రతిమ.. హఠాత్తుగా హత్యకు గురికావడం తీవ్ర సంచలనం రేపింది. దీనిపై సర్వత్రా అనుమానాలు మొదలయ్యాయి. ఇటీవల జరిపిన తనిఖీలే ప్రతిమ హత్యకు కారణమై ఉండొచ్చనే సందేహాలు వ్యక్తమయ్యాయి.

ట్రెండింగ్ వార్తలు