DK Shivakumar: ‘వందేమాతరం’ రెండు చరణాలే పాడతాం.. డీకే శివకుమార్ సంచలన ప్రకటన
‘వందేమాతరం’ మొదటి రెండు చరణాలను మాత్రమే ఆలపిస్తామని కర్ణాటక ఉపముఖ్యమంత్రి, సీఎం స్థాయి నాయకుడు డీకే శివకుమార్(DK Shivakumar) స్పష్టం చేశారు.
- V Santhosh Kumar
- Published on- August 26, 2026 / 03:58 PM IST
Karnataka govt to sing only two stanzas of vande mataram dk shivakumar clarifies
- ఇకపై వందేమాతరం రెండు చరణాలే
- కాంగ్రెస్ పార్టీ నిర్ణయానికి కట్టుబడి
- మతాలకు అతీతంగా పాలన సాగిస్తాం
DK Shivakumar: కర్ణాటక ప్రభుత్వ అధికారిక కార్యక్రమాల్లో ఇకపై ‘వందేమాతరం’ గేయానికి సంబంధించి కేవలం మొదటి రెండు చరణాలను మాత్రమే ఆలపిస్తామని ఆ రాష్ట్ర ఉపముఖ్యమంత్రి, సీఎం స్థాయి నాయకుడు డీకే శివకుమార్(DK Shivakumar) స్పష్టం చేశారు. ఈ విషయంలో కాంగ్రెస్ పార్టీ తీసుకున్న నిర్ణయానికి తాము పూర్తిగా కట్టుబడి ఉంటామని తేల్చి చెప్పారు. ఇటీవల జరిగిన స్వాతంత్ర్య దినోత్సవ వేడుకల్లో ఆరు చరణాలు ఆలపించడంపై స్పందిస్తూ, అది తనకు తెలియకుండానే జరిగిపోయిందని ఆయన వివరణ ఇచ్చారు.
Kangana Ranaut: బ్రో.. కాస్త ఆగు.. రాహుల్‌కు సాలిడ్ కౌంటర్ ఇచ్చిన కంగనా రనౌత్
1937 కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ తీర్మానానికి కట్టుబడి:
వందేమాతరం గేయంలో మొదటి రెండు చరణాలు మాత్రమే పాడాలని 1937 నాటి కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ (CWC) సమావేశంలో తీర్మానించారని, ఆ విధానాన్నే కొనసాగిస్తామని ఆయన పేర్కొన్నారు. ఆరు చరణాలు ఆలపించాలని కేంద్ర ప్రభుత్వం ఇటీవల చట్టరూపం ఇచ్చిన నేపథ్యంలో కాంగ్రెస్ పార్టీ ఈ కీలక నిర్ణయాన్ని పునరుద్ఘాటించింది. దేశంలో భిన్న సంస్కృతులు, మతాల ప్రజలు ఉన్నందున అందరినీ కలుపుకొని ముందుకు సాగడమే తమ పార్టీ సిద్ధాంతమని సీఎం వ్యాఖ్యానించారు.
మతాలకు అతీతంగా పాలనపై డీకే శివకుమార్ వ్యాఖ్యలు:
పాలనలో అందరినీ సమానంగా గౌరవించడమే తమ నైతిక బాధ్యత అని ఆయన అన్నారు. హిందూ వర్సెస్ హిందుత్వవాదంపై జరుగుతున్న రాజకీయ చర్చను ప్రస్తావిస్తూ.. సూర్యుడు, చంద్రుడు, గాలి, నీటికి ఎలాంటి మతమూ ఉండదని ఆయన ఉద్ఘాటించారు. సమాజంలోని అన్ని వర్గాల ఆకాంక్షలకు అనుగుణంగా నడుచుకోవడమే తమ ప్రభుత్వ ప్రాధాన్యత అని శివకుమార్ స్పష్టం చేశారు.
