Kangana Ranaut: బ్రో.. కాస్త ఆగు.. రాహుల్కు సాలిడ్ కౌంటర్ ఇచ్చిన కంగనా రనౌత్
రాహుల్ గాంధీ ‘పితృస్వామ్యాన్ని కూల్చేయండి’ అంటూ చేసిన వ్యాఖ్యలపై బీజేపీ ఎంపీ, నటి కంగనా రనౌత్(Kangana Ranaut) ఘాటుగా స్పందించారు.
Kangana ranaut counters rahul gandhi patriarchy remark
- రాహుల్ వ్యాఖ్యలపై కంగనా కౌంటర్
- ట్రిపుల్ తలాక్, రిజర్వేషన్లపై పోస్ట్
- సోషల్ మీడియాలో పోస్ట్ హల్చల్
Kangana Ranaut: నటి కృతి సనన్ చుట్టూ నడుస్తున్న వివాదంపై కాంగ్రెస్ నాయకుడు రాహుల్ గాంధీ ‘పితృస్వామ్యాన్ని కూల్చేయండి’ అంటూ చేసిన వ్యాఖ్యలపై బీజేపీ ఎంపీ, నటి కంగనా రనౌత్(Kangana Ranaut) ఘాటుగా స్పందించారు. భారతీయ జనతా పార్టీ తన అధికారిక సోషల్ మీడియా ఖాతాలో షేర్ చేసిన కొన్ని వ్యంగ్యాత్మక చిత్రాలను (మీమ్స్) ఆమె తన ఖాతాలో రీషేర్ చేస్తూ కాంగ్రెస్ పార్టీ, రాహుల్ గాంధీ తీరును తీవ్రంగా ఎండగట్టారు.
ట్రిపుల్ తలాక్, మహిళా రిజర్వేషన్లపై కాంగ్రెస్ వైఖరిపై విమర్శలు:
బీజేపీ షేర్ చేసిన చిత్రాలలో ట్రిపుల్ తలాక్ రద్దు, మహిళా సంక్షేమం, మహిళా రిజర్వేషన్ల బిల్లు విషయంలో కాంగ్రెస్ అనుసరించిన వైఖరిని ఎద్దేవా చేశారు. పితృస్వామ్యం గురించి మాట్లాడే రాహుల్ గాంధీని ఉద్దేశించి, ఓట్ బ్యాంక్ రాజకీయం కోసమే కాంగ్రెస్ పార్టీ మహిళల హక్కులకు వ్యతిరేకంగా నిర్ణయాలు తీసుకుందని ఆ చిత్రాల ద్వారా ఆరోపించారు. పితృస్వామ్య నినాదాల వెనుక కాంగ్రెస్ రాజకీయ ప్రయోజనాలే ఉన్నాయని బీజేపీ విమర్శించింది.
‘భారత్ మాతాకీ జై’ అంటూ కంగన వ్యంగ్యాస్త్రాలు:
ఈ కార్టూన్ చిత్రాలను షేర్ చేసిన కంగనా రనౌత్, రాహుల్ గాంధీని ఉద్దేశించి “బ్రో కాస్త ఆగు.. భారత్ మాతాకీ జై” అంటూ క్యాప్షన్ జత చేశారు. రాహుల్ గాంధీ ఎప్పుడూ నిజమైన మహిళా సాధికారతకు లేదా మహిళల పక్షాన నిలబడలేదని ఆమె పరోక్షంగా చురకలు అంటించారు. ప్రస్తుతం ఈ పోస్ట్ రాజకీయ వర్గాల్లోనూ, సోషల్ మీడియాలోనూ తీవ్ర చర్చనీయాంశంగా మారింది.
