High Court : భర్త నల్లగా ఉన్నాడని భార్య వేధించడం క్రూరత్వమే.. ఆ జంటకు విడాకులు మంజూరు చేసిన కర్ణాటక హైకోర్టు

భర్త నల్లగా ఉన్నాడని భార్య అతన్ని వేధించారు. దీనిపై అతను కర్ణాటక హైకోర్టును ఆశ్రయించారు. ఈ కేసులో హైకోర్టు విడాకులు మంజూరు చేసింది.

Karnataka High Court (1)

Karnataka High Court : భర్త నల్లగా ఉన్నాడని భార్య వేధించడం క్రూరత్వమే అవుతుందని కర్ణాటక హైకోర్టు పేర్కొంది. లేనిపోని కారణాలతో భర్తను దూరం పెట్టిన భార్య వైఖరిని హైకోర్టు తప్పు పట్టింది. ఈ కేసులో ఆ జంటకు విడాకులు మంజూరు చేస్తూ హైకోర్టు తీర్పు ఇచ్చింది. భర్త నల్లగా ఉన్నాడని భార్య అతన్ని వేధించారు. దీనిపై అతను కర్ణాటక హైకోర్టును ఆశ్రయించారు. ఈ కేసులో హైకోర్టు విడాకులు మంజూరు చేసింది.

భర్త నల్లగా ఉన్నాడని భార్య వేధించడం క్రూరత్వం అవుతుందని వెల్లడించింది. నల్లగా నల్లగా ఉన్నాడని పదే పదే వేధించడం వల్ల భర్త తన భార్యను విడిచి పెట్టాల్సివచ్చిందని హైకోర్టు పేర్కొంది.
అయితే భార్య తన వేధింపులను కప్పిపుచ్చుకునేందుకు భర్తపై లేనిపోని ఆరోపణలు చేసినట్లు కోర్టు తెలిపింది. భర్తపై అక్రమ సంబంధం ఆరోపణలు కూడా చేసినట్లు పేర్కొంది.

Manmohan Singh : 90 ఏళ్ల వయస్సులో వీల్ చైర్‌లో రాజ్యసభకు వచ్చిన మన్మోహన్ సింగ్ ..

భర్తపై అసత్య ఆరోపణలు చేసిన భార్య క్రూరత్వానికి పాల్పడినట్లేనని కోర్టు స్పష్టం చేసింది. హిందూ వివాహ చట్టంలోని సెక్షన్ 13(ఐ)(ఏ) ప్రకారం ఆ జంటకు విడాకులు మంజూరు చేస్తూ కోర్టు తీర్పు ఇచ్చింది. కర్ణాటక రాజధాని బెంగళూరుకు చెందిన ఆ జంట 2007లో వివాహం చేసుకుంది.

వారికి ఓ అమ్మాయి జన్మించారు. అయితే 2021లో విడాకులు కావాలని భర్త ఫ్యామిలీ కోర్టును ఆశ్రయించాడు. ఈ కేసులో జస్టిస్ అలోక్ఆరాధే, జస్టిస్ అనంత రామనాథ్ హెగ్డేలతో కూడిన ధర్మాసనం తీర్పు వెల్లడించింది. కేవలం కూతురి కోసం భర్త ఆ అవమానాలు భరించినట్లు కోర్టు పేర్కొంది.

Dmitry Glukhovsky : ఉక్రెయిన్ పై దాడిని ఖండించిన రష్యా రచయితకు 8 ఏళ్లు జైలుశిక్ష

కాగా, భర్తే తనను వేధింపులకు గురి చేస్తున్నట్లు భార్య గృహ హింస కేసు పెట్టారు. ఈ కేసు పూర్వపరాలు పరిశీలించిన కోర్టు భార్య వాదనను తిరస్కరించింది. భర్తతో కలిసి ఉండేందుకు ఆమె రాలేదని, వైవాహిక బంధంలో కొనసాగేందుకు ఆమెకు ఇష్టం లేదన్న విషయాన్ని కోర్టు గ్రహించింది. అందుకే ఆ జంటకు విడాకులు మంజూరు చేస్తున్నట్లు హైకోర్టు పేర్కొంది.

ట్రెండింగ్ వార్తలు